సినీనటి రష్మిక మందన్నపై జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి అసభ్యకర కామెంట్ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై కలెక్టర్‌ను మీడియా సంప్రదించగా.. తనకు ఆ పేరుతో ట్విట్టర్లో ఖాతానే లేదని, అధికారిక అకౌంట్ హ్యాక్ అయిందని.. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, జగిత్యాల కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి రష్మిక మందన్నపై కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. జిల్లా లేబర్ డిపార్ట్ మెంట్ జనరల్ మేనేజర్ గంగాధర్ శ్రీనివాస్ ఈ వివాదానికి అసలు కారకుడని పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా
కలెక్టర్ పేరును వచ్చిన ట్వీట్ విషయమై డీఆర్వో అరునశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 406,419,420 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇ-మేనేజ్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ అనే తాత్కాలిక ఉద్యోగి.. జిల్లా కలెక్టర్ పేరున ఉన్న అధికారిక ట్విట్టర్ ఖాతాలో నూతన కలెక్టర్ రవి ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా మార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కలెక్టర్ రవి అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రసాద్, మమతలను విధుల నుంచి తొలగించారు.
Also Read: ఆ యువతిని తల్లిదండ్రులే కడతేర్చారు.. కారణం తెలిస్తే షాక్!
కాగా, హీరోయిన్ రష్మిక మందన్న రెండు ఫొటోలో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నేను మీవైపు ఓ క్షణం చూస్తే.. మీరు నవ్వాలి అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది రష్మిక. అయితే ఈ పోస్టుకు జగిత్యాల కలెక్టర్ రవి ఖాతా నుంచి ‘చించావు పో..’ అని రీట్వీట్ చేశారు. కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్లా అని ఐఏఎస్ రవి వివాదంలో చిక్కుకున్నారు. ట్వీట్ చేసిన సమయంలో మంత్రి కొప్పు ఈశ్వర్‌తో కలెక్టర్ రవి అధికారిక సమావేశంలో పాల్గొనడం గమనార్హం.