టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. పుష్ప సినిమాతో తన స్ట్రాటజీ నిరూపించుకున్నారు. ఇక డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప 2 సినిమా విడుదలై మొదటి రోజే రూ.294 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులను సైతం కొల్లగొట్టింది. అంతేకాదు విడుదలైన వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది ఈ సినిమా.
ఇకపోతే ఈ సంతోషం ఎక్కువ కాలం మిగలలేదు అని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులో బెనిఫిట్ షోలు వేయగా సంధ్య థియేటర్ కి భారీ ర్యాలీ నిర్వహిస్తూ అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. అదే సమయంలో తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కొడుకు మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా చంచల్గూడా జైలుకు తరలివచ్చారు. ఆయనను విడిపించాలని కోరారు. కానీ ఇక్కడ ఒక మనిషి మరణించినప్పుడు ఎందుకు ఎవరు స్పందించలేదు.. అసలు మానవత్వం ఏమైంది.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడంతో ఈ విషయం కాస్త ఆలోచించదగినదే కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. చంచల్గూడా జైలుకు తరలించిన తర్వాత.. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇక అందులో భాగంగానే నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. Pushpa 2 contro
ఇకపోతే నిన్న సాయంత్రం బెయిల్ వచ్చినప్పటికీ చంచల్గూడా జైలు పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ను రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఈరోజు ఉదయం ఆయనను బయటకు పంపించడం జరిగింది.
ఇకపోతే చంచల్గూడా జైలుకు అల్లు అర్జున్ ని ని తరలించిన తర్వాత.. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇక అందులో భాగంగానే నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం బెయిల్ వచ్చినప్పటికీ చంచల్గూడా జైలు పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ను రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఈరోజు ఉదయం ఆయనను బయటకు పంపించడం జరిగింది.
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎప్పుడు జైలు నుంచి వస్తారని తన కూతురు అర్హ ఎదురు చూస్తున్నట్టు.. వీడియోలు షేర్ చేశారు. ఈ క్రమంలో ఎంతో మంది అభిమానులు.. రేవతి కొడుకు, కూతురు కూడా తమ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారని.. అయితే ఆమె ఎప్పటికీ రాదు అని.. మరి అలాంటి వాళ్ళ పైన లేని దయ కొంతమంది ప్రేక్షకులకు అలానే సెలబ్రిటీస్ కి.. అల్లు అర్జున్ పైన మాత్రం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.