PV Sindhu: ఎంగేజ్మెంట్‌ చేసుకున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌.. కాబోయే భర్తతో పీవీ సింధు ఫోటో వైరల్‌..

PV Sindhu Engagement Photo: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు... ప్రముఖ పోసిడెక్స్ టెక్నాలజీ ఈడీ వెంకట దత్త సాయితో రింగు మార్చుకున్నారు. ఆ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

1 /5

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ డబుల్ మెడలిస్టు పీవీ సింధు ఈరోజు వెంకట దత్త సాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. ఈ నెల 24న వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌ వేధికగా జరగనున్న సంగతి తెలిసిందే.   

2 /5

ఈ నేపథ్యంలో వీరు ఈరోజు డిసెంబర్ 14వ తేదీ  శుక్రవాం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పీవీ సింధు పంచుకున్నారు... కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్‌ చేసుకుని, కేక్ కట్ చేసిన ఫోటోను ఆమె ఇన్స్టాల్ లో షేర్ చేశారు.  

3 /5

పీవీ సింధు పెళ్లి చేసుకోబోయేది పోసిడెక్స్ టెక్నాలజీ ఈడీ వెంకట దత్త సాయి. వీరి కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన కోట్‌ 'ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనం ప్రేమించాలి అని ఇన్‌స్టాగ్రామ్‌ వేధికగా ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోను పంచుకున్నారు  

4 /5

అయితే ప్రముఖ బిజినెస్ మ్యాన్ వెంకట దత్త సాయితో డిసెంబర్ 22న ఉదయపూర్ వేదికగా పీవీ సింధు పెళ్లి జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ 24వ తేదీన ఉంటుందని ఆమె తండ్రి మీడియాతో అన్నారు.   

5 /5

ఇదిలా ఉండగా జనవరి నెలలో కూడా పీవీ సింధు కొన్ని టోర్నీలు ఇండియా తరఫున ఆడాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యాడ్మింటన్ స్టార్ బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.