Rare Red King Cobra Viral Video Watch Now Here: భూమిపై వివిధ రకాల విషపూరితమైన పాములు నివసిస్తూ ఉంటాయి. అందులో చాలా వరకు అడవి ప్రదేశాల్లో ఉంటే.. కొన్ని మాత్రం అక్కడిక్కడ సంచారం చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. పాములు వివిధ రకాలు అన్నట్లు..కొన్ని పాములు విషయం కలిగి ఉంటే, మరికొన్ని పాములు విషం లేనివిగా కూడా ఉంటాయి. మనం తరుచుగా చూసే పాములన్నీ విషం ఉన్నవే. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జాతులకు సంబంధించిన వింత స్నేక్స్ వీడియోస్ చూసేందుకు చాలా మంది నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో చాలా అరుదైన ఒక పాము మాములుగా వైరల్ అవ్వడం లేదు. దీనిని చూసిన నెటిజన్స్ పాములు ఈ రంగులో కూడా ఉంటాయా? అన్ని ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం నెట్టింట్లో రెండ్ కలర్ కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా గతంలో ఇలాంటి పాములను చూడడం చాలా అరుదని నెటిజన్స్ కూడా కామెంట్లలో స్పందిస్తున్నారు. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఊళ్లోని కూలిపోయిన బంగ్లాలోని ముందు ప్రదేశంలో చాలా అరుదైన ఎరుపు రంగుతో కూడిన పాము సంచారం చేస్తూ ఉంటుంది. అయితే దీనిని అక్కడున్న స్థానికులు గమనించి.. దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని బంధించారు. అయితే పామును పట్టుకునే సమయంలో అది ఎంతో కోపంతో పడగవిప్పి కాటేసేందుకు కూడా ప్రయత్నించింది. స్థానికులు ఏ మాత్రం వణకకుండా దానిని పట్టుకుని జాగ్రత్తగా బంధించారు. అయితే చాలా సార్లు మనం పాములను చూసి ఉంటాం.. కానీ ఇలాంటి ఎరుపు రంగుతో కూడా పాములు చూడడం చాలా అరుదు.
అలాగే ఇంలాంటి జాతికి సంబంధించిన రెడ్ కింగ్ కోబ్రాలు కొన్ని బంగారు రంగులో కూడా ఉంటాయని సమాచారం. అయితే ఇవి సాధరనంగా సంచారం చేసే పాముల కంటే చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ పాముకు కావాలనే రెడ్ కలర్ వేశారని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెడ్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఇతర రంగులు కలిగిన పాములను పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.