Hyderabad Greater City : హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో భూములు ఎగబడి కొనేస్తున్నారు.. చదరపు గజం ధర మరీ ఇంత తక్కువనా?

Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. ఈమధ్య కాలంలో విపరీతంగా రియల్ బూమ్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ధరలు పెరుగుతూనే ఉణ్నాయి.ఇందులో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈమధ్యే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త వెంచర్లు కూడా ఊహకందని రీతిలో డిమాండ్ పెరిగింది. అక్కడకూడా హైరేంజ్ బిల్డింగ్స్, విల్లాలు నిర్మించేందుకు రియలర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లోని ఈ రెండు ఏరియాల్లో భూములను జనం ఎగబడి  కొనేస్తున్నారు. చదరపు గజం ధర ఎంత ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 
 
1 /8

2 /8

గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే  ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రముఖ మార్కెట్లతోపాటు హైదరాబాద్ కూడా పోటీ పడుతోంది. ఇక్కడ కూడా ఆ నగరాల కంటే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. సేల్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. 

3 /8

అయితే గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఉన్న పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చాయి. ఇళ్లు కొనేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇక్కడ 100 అడుగుల రోడ్లు కూడా వేసే ప్రపోజల్స్ ఉండటంతో భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ నేషనల్ హైవేకు ఆనుకుని ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయి. 

4 /8

ఇప్పటి వరకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ ప్రాంతాలే కేంద్రంగా ఐటీ కారిడార్లను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్ మెంట్ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీంతో కొన్ని కీలక ప్రాజెక్టులను ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 

5 /8

దీనిలో భాగంగానే ఐటీ కంపెనీలను పెద్దెత్తున తీసుకువస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనేందుకు ఎక్కువమంది మిడిల్ కాల్స్ పీపుల్స్ ఇంట్రెస్ట్  చూపిస్తున్నారు. వీరిని పరిగణలోనికి తీసుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్ మెంట్స్, లే అవుట్స్ వేస్తున్నారు. ఉన్నత వర్గాలను పరిగణలోనికి తీసుకుని మరికొందరు హైరేంజ్ బిల్డింగులు, విల్లాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. పర్మిషన్స్ కోసం హెచ్ఎండీఏకు పెద్ద సంఖ్యలు దరఖాస్తులు కూడా వస్తున్నాయి. 

6 /8

మొన్నటివరకు శంషాబాద్, శంకర్ పల్లి జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు, వెంచర్లకు దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు మేడ్చల్, ఘట్కేసర్ జోన్లలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ఘట్కేసర్, పోచారం పరిధిలో భూముల ధర చదరపు గజానికి రూ. 25వేల నుంచి రూ. 40వేల వరకు పెరిగిందని ఓ రియల్టర్ తెలిపారు. 

7 /8

ఈ రెండు ప్రాంతాల్లో ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ఉండటంతోపాటు ఘట్కేసర్ మున్సిపాలిటీ గా మారడం, హెచ్ఎండీఏకు మాస్టర్ ప్లాన్ అనుసరించి వంద ఫీట్ల రోడ్లు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 11.6కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రేస్ వే నిర్మాణం జరుగుతుండటంతో ఆ ప్రాంతాలు చాలా డెవలప్ అవుతున్నాయి.

8 /8

 వరంగల్ నేషనల్ హైవే విస్తరణతోపాటు సమీపంలోని పోచారం టౌన్ షిప్ ఉండటంతో పోచారం, నారపల్లి, చౌదరిగూడ, అన్నోజిగూడ, ఘట్కేసర్, శివారెడ్డిగూడ, యానంపేట  ప్రాంతాల్లో భూములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో అయితే విల్లా 3కోట్లు, ఫ్లాట్ అయితే రూ. 70 లక్షలు పలుకుతోంది.