Manchu Mohan Babu Properties: మోహన్ బాబు ఆస్తుల మొత్తం ఎంతో తెలుసా..! ఎవరి వాటా ఎంతంటే..?

Mohan Babu Networth: వందల సినిమాల్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి ఎన్నో వందల చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మోహన్ బాబు. తన డైలాగ్స్‌తో టాలీవుడ్‌లో డైలాగ్‌ కింగ్‌గా.. సినిమాల కలెక్షన్స్‌తో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన సక్సెస్‌ అయ్యారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఈ గ్రేట్ యాక్టర్‌ ఫ్యామిలీలో గొడవలు అభిమానులకు రుచించడం లేదు. చిన్న కొడుకు మంచు మనోజ్‌తో వివాదంతో మోహన్ బాబు వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆస్తుల వ్యవహారమే గొడవలకు కారణమైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఎంత వాటా ఇచ్చారు..? ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /9

మోహన్ బాబుకు వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన నటుడిగా.. ప్రొడ్యూసర్‌గానే కాకుండా వ్యాపార రంగంలో కూడా సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన భారీగానే సంపాదించారు.  

2 /9

తన ఆస్తులను ముగ్గురు సంతానం (మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్)కు సమానంగానే పంచుతానని గతంలో చెప్పారు.  

3 /9

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎక్కువ వ్యాల్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. 1992 ప్రారంభించిన ఈ విద్యా సంస్థ.. ప్రస్తుతం యూనివర్సిటీగా మారింది. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  

4 /9

ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తోపాటు 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సంస్థను మంచు విష్ణుకు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

5 /9

ఇవి కాకుండా హైదరాబాద్‌, రంగారెడ్డిలో మోహన్ బాబుకు ఖరీదైన భవనాలు ఉన్నాయి. జల్‌పల్లి ఫామ్‌ హౌస్‌ ఎంతో ఇష్టంగా మోహన్ బాబు కట్టుకోగా.. ఈ ఇల్లు కేంద్రంగానే ప్రస్తుతం వివాదాలు జరుగుతున్నాయి.  

6 /9

ఫిల్మ్ నగర్‌లోని ఇల్లుతోపాటు మరికొన్ని ఖరీదైన ప్లాట్స్‌ను మంచు లక్ష్మీకి ఇచ్చినట్లు సమాచారం.  

7 /9

మంచు మనోజ్‌కు నగర శివార్లలోని ఓ ప్లాట్.. మరికొన్ని ల్యాండ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మంచు మనోజ్ చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

8 /9

చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్నా.. మంచు మనోజ్ పెళ్లి తరువాత గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్స్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.  

9 /9

తాను కష్టార్జితంగా సంపాదించుకున్న ఆస్తులను ఎవరికైనా ఇచ్చే హక్కు తనకుందని మోహన్ బాబు ఓ ఆడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మంచు మనోజ్‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచానని.. చివరికి తన గుండెలపై తన్నాడని వాపోయారు.