Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్

Bigg Boss Telugu 8: మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు మెగా ఫినాలేకు ముందే బయటకురానున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన 10 లక్షల సూట్‌కేసును స్వీకరించనున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2024, 01:28 PM IST
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు ముందే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. చివరి వారం పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండానే ముగియనుంది కానీ చివర్లో ఒక ట్విస్ట్ ఉండబోతోంది. టాప్ 5లో తొలి ఫైనలిస్ట్ అవినాష్ అందరికంటే ముందే బయటకు వచ్చేస్తున్నాడని సమాచారం. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ప్రతి సీజన్‌లో బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లకు ఆఫర్ ఇస్తుంటాడు. 10 లేదా 20 లేదా 30 లక్షల సూట్‌కేసు ఇచ్చి పోటీ నుంచి తప్పుకోమని సూచిస్తుంటాడు. ఇప్పుడూ అదే జరగనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్లలో తొలి ఫైనలిస్టు అవినాష్ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. మెగా ఫినాలేకు ముందు రోజు అంటే డిసెంబర్ 14 శనివారం నాడు బిగ్‌బాస్ హౌస్‌లో కీలకమైన ట్విస్ట్ కన్పించనుందని తెలుస్తోంది. ఎప్పటిలానే ఈసారి బిగ్‌బాస్ 10 లక్షల సూట్‌కేసును అవినాష్‌కు ఆఫర్ చేయనున్నాడు. 10 లక్షల సూట్‌కేసుతో పాటు 15 వారాల రెమ్యునరేషన్ తీసుకుని బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఆఫర్‌కు అవినాష్ ఒప్పుకున్నాడా లేదా అనేది చూద్దాం.

వాస్తవానికి అవినాష్ ఎప్పుడో ఎలిమినేట్ కావల్సి ఉంది. కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడు. ఆ విషయాన్ని అవినాష్ స్వయంగా ఒప్పుకున్నాడు. సరైన టైమింగ్ కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తున్నా ఫినాలే గెలిచేంత సత్తా లేదనేది సమాచారం. ఆ విషయం అవినాష్‌కు కూడా తెలిసి ఉండవచ్చు. అందుకే బిగ్‌బాస్ ఇచ్చిన 10 లక్షల సూట్‌కేసు ఆఫర్ తీసుకుని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 14 శనివారం ప్రసారం కావచ్చు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక కొన్ని క్రేజీ షోల నిర్వహణ అవినాష్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. 

అంటే ఇక మిగిలిన టాప్ 4 కంటెస్టెంట్లతోనే మెగా ఫినాలే జరగవచ్చు. ఇప్పటికే ఓటింగులో గౌతమ్ వర్సెస్ నిఖిల్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. నబిల్ మూడో స్థానంలో, ప్రేరణ నాలుగో స్థానంలో ఉన్నారని సమాచారం. అందుకే అవినాష్ ఆఫర్ అంగీకరించి బయటకు వచ్చేయడం సరైన నిర్ణయమే కావచ్చనేది చాలా మంది అభిప్రాయం.

Also read: Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్, సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News