Pushpa 2 Climax: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడానికి డిసెంబర్ 5న విడుదలైంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్లో పుష్ప 3 ఉందని అందులో ఒక ముసుగు వ్యక్తిని కూడా చూపించారు.
అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప-2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అయితే పుష్ప-2 క్లైమాక్స్లో అనుకోకుండా పార్ట్ -3 కి సంబంధించి ఒక క్యారెక్టర్ ని చూపిస్తూ పుష్ప-3 ర్యాంపేజ్ అన్నట్టుగా తెలియజేశారు. అయితే సుకుమార్ ఎంతో పగడ్బందీగా ఒక ముసుగు వ్యక్తిని చూపించకుండా కొండమీద నుంచి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే విధంగా చూపించారు..
దీంతో ఒక్కసారిగా పార్ట్ -3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ఇప్పుడు పుష్ప-2 క్లైమాక్స్ లో చూపించిన ఆ ముసుగు వ్యక్తి ఎవరు?అనే విషయం పైన ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ఎక్కువ మంది అక్కడ హీరో విజయ్ దేవరకొండ ఉంటారనే విధంగా మాట్లాడుకుంటున్నారు..
మరి కొంతమంది పుష్ప-1,2 చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించిన ఫహద్ ఫాజిల్ మళ్లీ బ్రతికి వస్తారని పుష్పరాజ్, శ్రీవల్లి వివాహ వేడుకలో ఉన్నప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేయిస్తారని తెలియజేస్తున్నారు.. ముసుగు వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తూ స్క్రీన్ పై రిమోట్ పట్టుకొని బాంబు బ్లాస్ట్ చేయడంతో చాలామంది ఎవరికి తోచిన విధంగా వారు క్లైమాక్స్ లో చూపించిన ముసుగు వ్యక్తిని ఊహించుకుంటున్నారు నెటిజన్స్.
పుష్ప-1, పుష్ప -2 లో పుష్ప రాజ్ ను ఎదుర్కొనే సమయంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటారు షెకావత్.. అంతేకాకుండా ఎన్నో అవమానాలు జరగడంతో చివరికి ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టుగా చూపిస్తారు.. కానీ నిజానికి షెకావత్ అక్కడ మరణించారు. పుష్ప రాజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్లీ బ్రతికి వస్తారని ఇందుకు కొన్ని సాక్షాలు కూడా చూపిస్తున్నారు..
అయితే క్లైమాక్స్ లో కనిపించే వ్యక్తి చేయి చాలా సన్నగా ఉండడం అలాగే చేతి పైన కాలిన గాయాలు ఉండడంతో శేకావత్ మళ్ళీ పుష్పరాజ్ కుటుంబాన్ని మట్టుపెట్టేందుకు బతికి వస్తాడనే విధంగా తెలియజేస్తున్నారు.. మొత్తానికి ఇది పార్ట్-3 ర్యాంపేజ్ లో తెలుస్తోంది.. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా షూటింగ్ మొదలు కాదని సుమారుగా ఐదు ఆరేళ్లు పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.