Brahmamudi Kavya: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి కావ్య..? బిగ్‌ సర్‌ప్రైజ్‌ అంటూ వైరల్‌ పోస్ట్‌..!

Brahmamudi Kavya Entry In Bigg Boss 8 Telugu: 'బ్రహ్మముడి' సీరియల్‌ స్టార్‌మా లో టెలిక్యాస్ట్ అవుతుంది. ఇది మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్‌గా మానస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కావ్య అలియాస్‌ దీపికా రంగరాజ్‌ ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది.
 

1 /5

బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 చివరి వారం కొనసాగుతుంది. నిన్న ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈమె బిగ్‌ బాస్‌ 8 లో భారీ రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విన్నర్‌ ప్రైజ్‌ కంటే ఎక్కువ ఉండొచ్చు అని చెబుతున్నారు.  

2 /5

ప్రస్తుతం ఐదుగురు ఫైనలిస్టులు హౌస్‌లో ఉన్నారు. ఇందులో నిఖిల్‌, గౌతమ్‌, అవినాశ్‌, ప్రేరణ, నబీల్ ఉన్నారు. వీళ్లను ఫైనలిస్టులుగా నిర్ణయించారు. ఓటింగ్‌లో గౌతమ్‌ టాప్‌లో ఉన్నాడు. కానీ, ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడంతో అతనికి ట్రోఫీ ఇస్తారా? అనే సందిగ్ధం కూడా ఉంది.  

3 /5

అయితే, ప్రతిరోజూ హౌస్‌లోకి గెస్టులుగా వస్తున్నారు. చివరి వారం కావడంతో చాలామంది గెస్టులు వచ్చి మంచి ఎంటర్‌టైన్‌ ఇస్తున్నారు. చివరి వారంలో కొత్త సీరియల్‌ నటులు కూడా వస్తున్నారు.  

4 /5

తాజాగా 'బ్రహ్మముడి' కావ్య కూడా బిగ్‌ బాస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో 'బిగ్‌ సర్‌ప్రైజ్‌ కమింగ్‌ మై డియర్‌ ఫ్రెండ్స్‌' అంటూ ఓ కన్ను ఎమోజీ కూడా పెట్టింది. దీంతో బిగ్‌ బాస్‌ హౌస్‌లోకే అని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  

5 /5

దీంతో ఆమె చెప్పకనే చెప్పింది అని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మానస్‌, దీపిక రంగరాజ్‌లు వెళ్లి వాళ్లకు ఎంటర్‌టైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 15న ఫినాలే నిర్వహిస్తున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.