sobhita chaitu wedding pics: నాగచైతన్య, శోభితల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, శోభిత బుట్టలో కూర్చున్న పిక్స్, అరుంధతీ నక్షత్రం చూసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కొన్నినెలలుగా చైతు, శోభితల పెళ్లివేడుక గురించి ప్రతిరోజు వార్తలలో ఏవో కథనాలు వస్తునే ఉన్నాయి. మొత్తానికి వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగిపోయింది.
చైతు, శోభితల పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హజరయ్యారు.
వీరి పెళ్లి వేడుక రాత్రి 8. 13 నిముషాలకు హిందు సంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వీరి పెళ్లి క్రతువు దాదాపుగా 8 గంటల పాటు జరిగినట్లు తెలుస్తొంది.
చైతు, శోభితల పెళ్లి మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మార్మోగిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా పెళ్లి మండపంలో చైతు, శోభితకు తాళి కట్టేటప్పుడు.. అఖిల్ ఈల వేయడం తెగ వీడియో వైరల్ గా మారింది.
తాళి బొట్టు కట్టేటప్పుడు కూడా శోభిత ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ కొత్త జంట బిందేలో ఉంగరం ఆట సంప్రదాయంకు చెందిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా, ఈ జంట అరుంధతీ నక్షత్రం చూసిన పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.
అదే విధంగా శోబిత, చైతుల పెళ్లి అక్కినేని విగ్రహాం ముందు కూడా క్రతువుకూడా నిర్వహించినట్లు తెలుస్తొంది. నాగార్జున కూడా వీరి పెళ్లి ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. కొత్త జంటకు ప్రత్యేకంగా ఆశీర్వదించారు.
ఈ కొత్త జంట ఇటీవల శ్రీశైలం మల్లన్న, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్పెషల్ స్వాగతం పలికారు. అదే విధంగా ఈ జంట మొక్కులు తీర్చుకున్నారు.
కొత్త జంటను చూసేందుకు అక్కడి అభిమానులు ఆసక్తి చూపించారు. చైతు, శోభిత కూడా.. అభిమానులతో ఫన్నీగా నవ్వుతూ, అభిమానులు పలకరించినట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం శోభిత,చైతుల పెళ్లి ఫోటోలు మరల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తానికి కొత్త జంట పెళ్లి ఎలాంటి విఘ్నాలు లేకుండా.. పూర్తి అయినందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు.. అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తొంది.