New Pan 2.0: పాన్ కార్డు 2.0 వచ్చేసింది. ఈ కొత్త పాన్ కార్డు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ కొత్త పాన్ కార్డు క్యూఆర్ కోడ్‌తో ఉంటుంది. పాత పాన్ కార్డుతో పోలిస్తే ఇది చాలా సురక్షితం.
పాన్ 2.0 అనేది డిజిటల్ పాన్ కార్డు. ఇది క్యూఆర్ కోడ్‌తో ఉంటుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ కార్డు. అప్లై చేసిన కేవలం 30 నిమిషాల్లో మీ మెయిల్‌కు వచ్చేస్తుంది. పాన్ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. పాన్ 2.0 ద్వారా ఫిజికల్ పాన్ కార్డు ప్రక్రియను తగ్గించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే కొత్త పాన్ కార్డు చాలా సురక్షితం. ఇకపై 10-15 రోజులు పాన్ కార్డు కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. పాన్ కార్డు పీడీఎఫ్ పార్మట్‌లో కేవలం 30 నిమిషాల్లో మీ మెయిల్ ఐడీకు చేరుతుంది. అన్ని వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో ఉండటం వల్ల సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉంటుంది. ఆన్‌లైన్ వెరిఫికేషన్ కూడా మరింత సులభమౌతుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పాన్ కార్డు వెరిఫికేషన్ పూర్తయిపోతుంది. ఇకపై ఫిజికల్ కార్డ్ అవసరం ఉండదు.
కొత్త పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ ఇ పాన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ఇన్‌స్టంట్ పాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. మీ మెయిల్ ఐడీ , ఇతర వివరాలు సమర్పించాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీరు అప్లై చేసిన 30 నిమిషాల్లో కొత్త ఇ పాన్ కార్డు మీ మెయిల్ ఐడీకు వచ్చేస్తుంది. పీడీఎఫ్ ఫార్మట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. కొత్త పాన్ కార్డు లేదా పాన్ 2.0 మెయిల్ ద్వారా కోరుకుంటే ఎలాంటి ఛార్జి ఉండదు. ఫిజికల్ కార్డు కావాలంటే మాత్రం కనీస ఛార్జి ఉంటుంది.
Also read: 8th Pay Commission Date: 8వ వేతన సంఘంపై క్లారిటీ వచ్చేసింది, అదిరిపోయేలా పెరగనున్న జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.