Plum Fruit Benefits In Telugu: ప్లం ఫ్రూట్.. పేరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా.. ప్రయోజాలు మాత్రం బొలెడు ఉన్నాయి. ఈ పండు తింటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ A, C K పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
ప్లం ఫ్రూట్ పుల్లగా.. తీపిగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంది. అంతేకాదు రక్తపోటు వ్యాధులను కూడా నయం చేస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీలతో ఉంటే ఈ ప్లం పండును తింటే.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ పండులో ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక జీర్ణశయాంతర రుగ్మతలను నయం చేయడంలో ప్రయోజనకారికి పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ప్లం ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించి.. స్లిమ్‌గా కనిపించేందుకు దోహద పడుతుంది.
ప్లం పండు తింటే.. రోగ నిరోధక శక్తి మెండుగా పెరుగుతుంది. ఈ పండులోని ఐరాన్ రక్త కణాలను వృద్ధి చేస్తాయి. రక్తహీనత సమస్య ఉన్న వారు ప్లం పండు తీసుకోవడం ఉత్తమం.
ఈ పండు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు నుంచి కూడా కాపాడుతుంది.
ప్లం పండు క్రమంగా తీసుకుంటే.. బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోపెనియా వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.