Bhudan Pochampalli Tragedy Accident: యాదాద్రి జిల్లాలోని భూదాన్ పొచంపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది... ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
భూదాన్ పోచంపల్లిలో ఈరోజు (శనివారం) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగూడెం వైపు నుంచి పోచంపల్లికి వెళ్తుండగా జలాల్పూర్లో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా హైదరాబాద్కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
మృతులు హైదరాబాద్ హయత్ నగర్ లోని ఆర్ టీసీ కాలనీకి చెందిన వంశీ గౌడ్, హర్ష, బాలు, వినయ్, దినేశ్గా గుర్తించారు. వీళ్లు కొత్తగూడెం నుంచి భూదాన్ పోచంపల్లి వైపు వెళ్తుండగా జలాల్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని, పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు తెల్లరంగులో ఉంది. ప్రస్తుతం దీన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు ప్రమాద విషయం చెప్పారు.