ఢిల్లీ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకే జనం మళ్లీ పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే కొలువుదీరేలా కనిపిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ . . గత ఐదేళ్ల పాలన చూసి ఓటు వేయాలని .. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో గడపగడపకు ప్రచారం చేసింది. ఢిల్లీ ప్రజలకు నీళ్లు, కరెంటు సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని .. కేజ్రీవాల్ పార్టీ ప్రచారం చేసుకుంది. ప్రజలు కూడా వారిని పూర్తిగా విశ్వసించినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 21 కేంద్రాల్లో ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ వడవడిగా సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీ ఇచ్చే పార్టీ లేకుండా పోయిందని తెలుస్తోంది. మొత్తంగా కేజ్రీవాల్ పార్టీ . . . 53 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. అటు బీజేపీ ... ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిపోటీ ఇస్తుందని . . . ఢిల్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ముందు అంతా భావించారు. కానీ బీజేపీ .. పెద్దగా పోటీ ఇవ్వడం లేదని .. ప్రస్తుతం జరుగుతున్న ఫలితాల ఆధిక్యాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. బీజేపీ కేవలం 16 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్... తొలుత రెండు స్థానాల్లో ఆధిక్యంలో కనిపించినప్పటికీ .. ఫలితాల క్రమంలో ఆ రెండు కూడా పోయాయి.