Kavya Maran: ఆస్తిపాస్తుల్లో అంబానీలకు పోటీగా కావ్య మారన్‌.. ఆమె ఆస్తుల చిట్టా ఇదే!

Kavya Maran Net Worth Value Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంతో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్‌పై పడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్‌పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్‌ ఆస్తులు, కుటుంబం మిగతా వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.

1 /7

పెద్దింటి పిల్ల: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమానిగా 2023 నుంచి కావ్య మారన్‌ వ్యవహరిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్ సీఈఓగా నియమితులయ్యారు. మీడియా మొగల్‌, బలమైన రాజకీయ నాయకుడి కుటుంబం నుంచి కావ్య వచ్చారు.

2 /7

తల్లిదండ్రులు: కావ్య మారన్‌ ఎవరో కాదు సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కూతురు. ఆమె తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్ సీఈఓ. 6 ఆగస్టు 1992న చెన్నైలో కావ్య మారన్‌ పుట్టారు.

3 /7

విద్యాభ్యాసం: వార్విక్ బిజినెస్ స్కూల్‌లో కావ్య ఎంబీఏ చదివారు. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. తండ్రి కళానిధి మారన్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమానిగా.. 2018 నుంచి ఫ్రాంచైజీకి సీఈఓగా కావ్య ఉన్నారు.

4 /7

ఎక్కడున్నా సందడి: ఐపీఎల్‌లో ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను కూడా కావ్య పొందారు. ఐపీఎల్‌ వేలంతోపాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కావ్య మారన్‌ సందడి చేస్తుంటారు.

5 /7

ఆస్తుల చిట్టా: ఇక కావ్య ఆస్తుల విషయానికి వస్తే ఆస్తుల నికర విలువ దాదాపు రూ.409 కోట్లు ఉంటుందని సమాచారం. కావ్య తండ్రి ఆస్తులు మొత్తం రూ.19,000 కోట్లు ఉంటుందని అంచనా.

6 /7

సొంతకాళ్లపై: తండ్రి గొప్ప వ్యాపారవేత్త అయినా కూడా కావ్య మారన్‌ వ్యాపారంలో రాణిస్తూ విజయవంతమైంది. కావ్య రాకతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరింత కళ వచ్చింది. ఆరెంజ్‌ ఆర్మీ ఫుల్‌ జోష్‌లో కొనసాగుతోంది.

7 /7

మరిన్ని బిజినెస్‌: ప్రస్తుతం క్రికెట్‌తోపాటు తండ్రికి సంబంధించిన వ్యాపారాలు చూస్తున్న కావ్య మారన్‌ భవిష్యత్‌లో వ్యాపారాలను విస్తరించాలని భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారంగా రాణించాలని కావ్య మారన్‌ లక్ష్యంగా విధించుకున్నట్లు సమాచారం.