/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

బుల్లితెర ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు ఓ యువతిని వేధించారని, అందుకుగానూ రెండు రోజుల జైలుశిక్ష అనుభవించాడని ఓ దర్శకుడు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రదీప్‌పై ఇలాంటి విషయం బయటకు రావడంతో బుల్లితెరతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా ఈ అంశం మారింది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడు. 

తాను జైలుకు వెళ్లాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశాడు. గతంలో న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీస్ కౌన్సెలింగ్‌కు మాత్రమే వెళ్లినట్లు ప్రదీప్ గుర్తుచేశాడు. తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, యువతిని వేధించాడని ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన దర్శకుడు సునిషిత్ ఎవరో కూడా తనకు తెలియదన్నాడు. ఆ పేరు తొలిసారి విన్నానని ప్రదీప్ చెప్పినట్లు తెలుస్తోంది. నిజనిజాలు తెలుసుకోవాలని, దయచేసి వదంతులకు చెక్ పెట్టాలని ప్రదీప్ కోరాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో యువతిపై వేధింపుల కేసు ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడని అతడి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో డ్రంక్ డ్రైవ్ కౌన్సెలింగ్ సమయంలోనూ ప్రదీప్ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

కాగా, యువతిని వేధించిన కేసులో రెండు రోజులు జైలుకు వెళ్లొచ్చిన ప్రదీప్ హీరోగా చేసేందుకు అనర్హుడంటూ సునిషిత్ అనే దర్శకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. జైలుకు వెళ్లిన వ్యక్తి సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ నియమాల ప్రకారం హీరోగా చేసేందుకు అర్హుడు కాదని ఫిర్యాదులో సునిషిత్ పేర్కొనడం హాట్ టాపిక్ అయింది.

కెరీర్ విషయానికొస్తే బుల్లితెర నుంచి వెండితెర మీద ఎప్పుడో వచ్చిన ప్రదీప్.. తాజాగా హీరోగా తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మున్నా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో త్వరలో వెండితెర మీద సందడి చేయనున్నాడు. తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు ప్రదీప్. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘నీలి నీలి ఆకాశం’ పాట రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నందుకు ప్రదీప్ థ్యాంక్స్ తెలుపుతూ ట్వీట్ చేశాడు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Section: 
English Title: 
Anchor Pradeep Machiraju clarifies rumours over harassment case filed in banjara hills PS
News Source: 
Home Title: 

ఏ అమ్మాయిని వేధించలేదు: యాంకర్ ప్రదీప్

Pradeep Machiraju: ఏ అమ్మాయిని వేధించలేదు, జైలుకు వెళ్లలేదు: కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్
Caption: 
Image : Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఏ అమ్మాయిని వేధించలేదు: యాంకర్ ప్రదీప్
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 4, 2020 - 08:47
Created By: 
Shankar Dukanam
Updated By: 
Shankar Dukanam
Published By: 
Shankar Dukanam