Maharashtra CM: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో మహాయుతి గత 50 యేళ్లలో ఏ పార్టీ లేదా కూటమికి దక్కనన్ని సీట్లు దక్కాయి మహాయుతి కూటమికి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే..మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా.. ? లేకపోతే మహాయుతిని ఏకం చేసి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఎక్కువ సీట్లు గెలిచేలా చేసిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మహా ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే ఆ అవకాశం దక్కుతుందని BJP చెబుతోంది. బీజేపీ మొత్తం 288 సీట్లలో 149 స్థానాల్లో పోటీ చేసి 132 స్థానాల్లో చారిత్రక విజయం సాధించింది. అంతేకాదు సీఎం సీటు కోసం బీజేపీ, శివసేన పట్టుబడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మహారాష్ట్ర అగ్ర నేత దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే ఢిల్లీకి పయనమయ్యారు.
మరోవైపు శివసేన (ఏక్ నాథ్ షిండే) 81 సీట్లలో పోటీ చేసి 57 సీట్లలో గెలిచింది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మాత్రం 59 సీట్లలో పోటీకిదిగి 41 సీట్లను సాధించడం విశేషం. మొత్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీ స్ట్రైక్ రేట్ దాదాపు 88 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం తమకే దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మిత్ర ధర్మాన్ని గౌరవించాలని శివసేన షిండే వర్గం అంటోంది. మహారాష్ట్ర శాసనసభ గడువు మంగళవారంతో ముగుయనుంది. గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్‌నాథ్ శిండేను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు. శిండేకు ఉన్న క్లీన్ ఇమేజ్, హరియాణా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా BJP కి చేసిన సాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. శిండేపై విశ్వాసం ఉంచి ఐదేళ్లు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. BJP హై కమాండ్ మాత్రం మహాయుతి కూటమి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఏక్‌నాథ్ శిందేకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టి దానితోపాటు కీలక శాఖలను అప్పగిస్తారని తెలిసింది. దానికి ఆయన అంగీకరిస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter