Pensioners Good News: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలలలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
పెన్షనర్లు మరణిస్తే కుటుంబీకులు మరణ ధృవీకరణ పత్రం మొబైల్ ఫోన్ ద్వారా పంపిస్తే చాలు ఆ కుటుంబీకుల్ని అధికారులు సంప్రదించి పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేస్తారు.
త్రివిధ దళాలకు చెందిన పెన్షనర్లకు సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఏర్పాటు చేయనున్నారు.
అదే సమయంలో పెన్షనర్లు మోసపోకుండా అప్రమత్తత జారీ చేశారు. ఎవరు అడిగినా ఓటీపీ ఇవ్వద్దని సూచించారు. పెన్షనర్లు ఓటీపీని చెన్నైలోని కార్యాలయంలో వ్యక్తిగతంగానే సమర్పించాల్సి ఉంటుంది.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పెన్షనర్లకు బయో ప్రూఫ్ నిర్ధారించేందుకు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటైంది. త్రివిధ దళాలకు చెందిన రిటైర్డ్ సైనికులకు, కుటుంబాలకు దరఖాస్తు చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించే చర్యలు తీసుకుంటున్నారు.