కశ్మీర్‌లో ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ.. కానీ!

ఆగస్టు 5న నిలిపివేసిన ఇంటర్ నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు నేడు అందుబాటులోకి వచ్చాయి. అయితే 2జీ స్పీడుతో పోస్ట్ పెయిడ్, ప్రి పెయిడ్ మొబైల్ యూజర్స్ అందరికీ సేవల్ని పునరుద్ధరించారు.

Last Updated : Jan 25, 2020, 02:44 PM IST
కశ్మీర్‌లో ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ.. కానీ!

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్బంగా జమ్మూకాశ్మీర్‌లో నిషేధించిన ఇంటర్‌నెట్‌ సేవల్ని శనివారం పునరుద్ధరించారు. దాదాపు ఆరున్నర నెలల అనంతరం కశ్మీరులో ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ నెట్ పునరుద్ధరించినా.. కేవలం 2జీ సేవల్ని మాత్రమే అందుబాటులోకి తేవడం గమనార్హం. అందులోనూ గణతంత్ర దినోత్సవం ముందురోజు అక్కడ ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం పునరుద్ధరించడం విశేషం. ప్రభుత్వం ఓకే చేసిన 301 వెబ్ సైట్లను మాత్రమే వినియోగించుకునే పరిమిత అవకాశం కల్పించారు. సేవల్ని పునరుద్దరిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: పౌరసత్వ సవరణ చట్టంపై స్టే కు సుప్రీం నిరాకరణ

సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేయడం మాత్రమే కశ్మీర్ వ్యాలీ ప్రజలకు సంతోషాన్ని కలిగించే విషయం. జనవరి రెండో వారంలో కశ్మీర్‌లో ఇంటర్నెట్ నిలిపివేతపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఎడ్యుకేషన్, న్యూస్, ట్రావెల్, బ్యాంకింగ్, ఇతరత్రా కీలకమైన ప్రభుత్వశాఖల వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి.

కాగా, ప్రజల జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కుల మధ్య సమతుల్యం అవసరమని పేర్కొన్న ఎన్వీ రమణ ధర్మాసనం .. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సేవల్ని నిలిపివేయాలని సూచించింది. ప్రభుత్వం వారం రోజుల్లోగా ఇంటర్ నెట్ సేవల నిలిపివేతపై సమీక్షించి, సేవల్ని పునరుద్ధరించాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో దాదాపు రెండు వారాలకు కశ్మీర్‌లో ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించారు. గతేడాది ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్ నెట్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News