Vemulawada Temple: వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను వంద ఏళ్లు ముందుకి తీసికెళ్తే.. రేవంత్ రెడ్డి వెనక్కి తీసుక పోతున్నాడని మండిపడ్డారు. మాట తప్పిన రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కావాలని.. మంచి బుద్ధి రావాలని వేములవాడ రాజన్నను మొక్కినట్లు వివరించారు.
Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్ యాత్రకు ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర
కోరుట్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు వెళ్తూ మంగళవారం హరీశ్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఇల వేల్పుపైన రేవంత్ రెడ్డి మాట తప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. పండించిన ధాన్యాన్ని ప్రైవేట్‌లో విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు
పాలన చేతగాక బోనస్ బోగస్ అయ్యిందని.. కానీ మహారాష్ట్ర లో వెళ్లి బోనస్ ఇస్తున్నామని మాయమాటలు చెప్పారని రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సన్నాలకు కూడా బోనస్ లేదని తెలిపారు. రైతులకు న్యాయం జరగాలని.. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయాలని రాజన్నను కోరుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలో దేవుళ్ల పై ఓట్లు పెట్టిన వారిలో రేవంత్ రెడ్డి మొదటివాడని.. దేవుళ్లపై ఓట్లు పెట్టి కూడా ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు.
రూ.2 లక్షలకు పైన ఉన్న వారికి నిబంధన పెట్టి.. చేసిన రుణమాఫీ పాక్షికంగా చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. నిబంధనలు.. కుంటి సాకులతో రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని చెప్పారు. రాజన్న దగ్గరికి వచ్చి తప్పయింది అని వేడుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్‌పై మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి కి లేదని.. 11 నెలల్లో ఏం కోల్పోయారో.. ఏమొచ్చిందో మాట్లాడుకుందామా అంటూ అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ వచ్చాక అన్ని రంగాల్లో అన్ని బంద్ అయ్యాయని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు తెలిపారు. విద్యార్థులు రోజు ధర్నాలు.. రైతు బందు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, పోలీసుల కుటుంబాల ఆందోజలన.. నేతన్న ఆత్మహత్యలు.. పాలమూరు ప్రాజెక్టు ఆగిపోవడం.. దళిత బంధు, బీసీ బంధు వంటివి అన్నీ ప్రజలు కోల్పోయారని వివరించారు. నాలుగేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish Rao: తెలంగాణకు కేసీఆర్ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్ రెడ్డి రివర్స్ చేస్తుండు