Revanth Reddy: పాలమూరు బిడ్డగా ఆ పని చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదు

Revanth Reddy Hate Speech In Kurumurthy Jathara:అధికారంలోకి వచ్చి కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదని రేవంత్‌ రెడ్డి తెలిపారు. పాలమూరును అభివృద్ధి బాట పట్టిస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 10, 2024, 03:43 PM IST
Revanth Reddy: పాలమూరు బిడ్డగా ఆ పని చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదు

Kurumurthy Jathara: సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధిని చేయకపోతే తనను చరిత్ర క్షమించదని.. చరిత్రహీనుడిగా చూస్తుందని పేర్కొన్నారు. నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామని ప్రకటించారు. తమ ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read: Harish Rao: మాజీ సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు

 

వనపర్తి జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని కురుమూర్తి రాయుడికి పూజలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం  ప్రసిద్ధి పొందిందని గుర్తుచేశారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Musi Yatra: రేవంత్‌ రెడ్డి మూసీ యాత్రలో అపశ్రుతి.. బొక్కబోర్లా పడిన ఫొటోగ్రాఫర్లు

 

'వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసేలా నిర్ణయాలు తీసుకుంటా. నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తాం' అని వివరించారు.

'మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు... జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు' అంటూ రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు.

'నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానన్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి  ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News