న్యూఢిల్లీ : ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం ఉత్తర రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీకి బయల్దేరి, ఉత్తర రైల్వే పరిధిలోకి ప్రవేశించిన 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది. దాదాపు 2 గంటల నుంచి 6 గంటల వరకు రైళ్లు ఆలస్యమవుతున్నట్టు ఇండియన్ రైల్వే పేర్కొంది. మాల్డా-ఢిల్లీ ఫరక్క ఎక్స్ప్రెస్ (13483) ఆరు గంటలు ఆలస్యంగా, చెన్నై-న్యూ ఢిల్లీ జిటి ఎక్స్ప్రెస్ (12615) 5 గంటలు ఆలస్యం, ఆజంఘడ్-ఢిల్లీ జంక్షన్ కైఫియత్ ఎక్స్ప్రెస్ (12225) 4 గంటల 45 నిమిషాలు, కతిహార్-అమృత్సర్ ఎక్స్ప్రెస్ (15707) నాలుగు గంటలు, పూరి-న్యూఢిల్లీ మధ్యరాకపోకలు సాగించే పురుషోత్తం ఎక్స్ప్రెస్ (12801) ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల జాబితాలో ఉన్నాయి. నార్త్ రైల్వే రీజియన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) వెల్లడించిన వివరాల ప్రకారం నేడు ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల వివరాలిలా ఉన్నాయి.
సోమవారం సైతం ఉత్తరాదిలో ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీకి బయల్దేరి రైళ్లన్ని కనీసం 2 గంటల నుంచి ఐదు గంటలపాటు ఆలస్యంగా గమ్యం చేరుకున్నాయి. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ (12723), రెవా-ఆనంద్ విహార్ రెవా ఎక్స్ప్రెస్ (12427), చెన్నై-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్ (12621), హౌర్-న్యూఢిల్లీ పూర్వ ఎక్స్ప్రెస్ (12381), దిబ్రుఘడ్ న్యూఢిల్లీ జంక్షన్ బ్రహ్మపుత్ర మెయిల్ (15955) వంటి రైళ్లపై పొగ మంచు తీవ్ర ప్రభావం చూపించింది. ఇక అంతకుముందు రోజైన ఆదివారం సైతం పొగ మంచు కారణంగా 19 రైళ్లు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..