BRS Party Viral Video: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 11 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపట్టింది. ఆరు బయట.. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ తాజాగా రాహుల్ గాంధీ పర్యటనను ప్రశ్నించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చని రాహుల్ గాంధీతో చర్చకు సిద్ధమంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో రాహుల్ గాంధీ భోజనం చేసిన బావర్చీ హోటల్లోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూర్చోని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా కుర్చీ వేసి.. బిర్యానీ ముందు పెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.
Also Read: KTR: సెక్యూరిటీ లేకుండా వస్తే రేవంత్ రెడ్డిని ప్రజలు తన్నే పరిస్థితి
గతేడాది నవంబర్ 25వ తేదీన హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ అశోక్ నగర్లో నిరుద్యోగులను కలిసి అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చీ హోటల్లో భోజనం చేశారు. ఆ సమయంలో నిరుద్యోగులకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ 11 నెలల పాలన ముగిసినా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ సార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.
Also Read: Harish Rao: రేవంత్ పాలనలో 36 మంది విద్యార్థుల బలి.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
తన బృందంతో సతీశ్ రెడ్డి బావర్చీ హోటల్‌కు చేరుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా ఒక ఖాళీ కుర్చీకి రాహుల్ గాంధీ నేమ్‌ప్లేట్ వేసి ఉంచారు. ఆ కుర్చీ ముందు బిర్యానీతోపాటు ఒక కూల్ డ్రింక్ ఉంచారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ బావర్చీ హోటల్‌కు కూడా వచ్చి బిర్యానీ తినేసి అశోక్ నగర్‌కు వెళ్లి రావాలని సతీశ్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు.
అనంతరం సతీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజుల్లో ఏడాది పూర్తవుతోంది. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పి వెళ్లండి' అని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వారు అది ఏమైందో కూడా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 'ఇప్పుడు కూడా అదే బావర్చీకి వచ్చి బిర్యానీ తిని ఓ సారి నిరుద్యోగులతో మాట్లాడి వెళ్లండి' అంటూ సతీశ్ రెడ్డి సలహా ఇచ్చారు. హోటల్లో ఉన్న ప్రజలతో మాట్లాడి మీరిచ్చిన ఆరు గ్యారంటీలు ఎందాక వచ్చాయో కూడా తెలుసుకోవాలని సూచించారు.
'రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు వెళ్లి రైతులను కలవండి. ఎరువులు, విత్తనాలకు రైతులు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూడండి' అంటూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి సూచించారు. 'పండించిన పంటను మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకోండి' అని సూచించారు. 'మంత్రులు కేరళ, జార్ఖండ్‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి మహారాష్ట్ర, కేరళ అంటూ తిరుగుతున్నారు' అని వివరించారు.
'తెలంగాణలో గెలిచిన చాలా రోజుల తర్వాత వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడైనా ప్రజలు, రైతులు, విద్యార్థులను కలిసి వెళ్లండి. మీ కోసం బావర్చీ వద్ద ఎదురుచూస్తున్నాం' అని సతీశ్ రెడ్డి తెలిపారు. కాగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ చేసిన వినూత్న నిరసన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలంగాణలో పర్యటించి మీరిచ్చిన హామీలపై సమీక్ష చేయండి' అంటూ నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తుండడం విశేషం.
. @RahulGandhi ji,
We are waiting in the same seat, same table and the same restaurant with the very same Bawarchi Biryani, where you dined a year ago.
Youth of Telangana are waiting to serve you and discuss on the promises given by you. Are you ready?
Hot Biryani & Chilling… pic.twitter.com/vTTZpEy7AM
— YSR (@ysathishreddy) November 5, 2024
రాహుల్ గాంధీ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చీలో వెయిట్ చేస్తున్న బిర్యానీ..
రాహుల్ గాంధీ కోసం స్పెషల్ కుర్చీ వేసి, ప్లేట్ పెట్టి బిర్యాని వడ్డించిన బీఆర్ఎస్ నేతలు..
బిర్యానీ చల్లబడకముందే బావర్చీకి రావాలని డిమాండ్..! https://t.co/2NDCGa48iI pic.twitter.com/JUIzlGlOII
— News Line Telugu (@NewsLineTelugu) November 5, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook