ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినలో ఎవరినీ కలవలేదని, బీజేపీ నేతల్ని కలిసేందుకు అపాయింట్ మెంట్ దొరకలేదన్న వదంతులకు తెరపడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ సోమవారం (జనవరి 13న) బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. నడ్డా నివాసంలో జనసేన పార్టీ కీలకనేత నాదేండ్ల మనోహర్‌తో కలిసి సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, రాజధాని అమరావతిపై నెలకొన్న ఆందోళన, ఇతరత్రా విషయాలను నడ్డాకు వివరించినట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో తలెత్తిన అనుమానాలు, మూడు రాజధానుల నిర్ణయాలను నడ్డాతో సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం శనివారమే భేటీ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో సమావేవం కాస్త వాయిదా పడిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జేపీ నడ్డాతో పాటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్యలు.. పవన్‌తో భేటీలో పాల్గొన్నారు.
ఈ రోజు కాకినాడ లో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ వారు,అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి , జనసేన నాయకులూ మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడితే,
నేను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము.— Pawan Kalyan (@PawanKalyan) January 12, 2020
బీజేపీ కీలకనేతలతో పవన్ భేటీ కావడం.. రెండు పార్టీల మధ్య పొత్తు విషయాన్ని రాజేస్తోంది. బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని, ఈ క్రమంలో ఏపీ పరిస్థితులపై కేంద్రం జోక్యాన్ని కోరేందుకు పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని ప్రచారం జోరందుకుంది. కాగా, నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు రానున్నారు. తనపై వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పవన్ నేరుగా కాకినాడకు వెళ్లి ధీటుగా బదులివ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వెళతానని పవన్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ దొరికేనా?
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..