200Mp Samsung New Phone: అబ్బబ్బా మొబైల్‌ అంటే ఇదే.. 200MP కెమెరాతో కొత్త Samsung ఫోన్‌.. చూడడానికి రెండు కళ్లు చాలవు!

200Mp Samsung New Phone: 200MP ప్రైమరీ కెమెరాతో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది సాంసంగ్‌ కంపెనీ నుంచి విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.


200Mp Samsung New Phone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్ వినూత్న ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో సాంసంగ్‌ కస్టమర్స్‌ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

1 /8

ప్రముఖ సాంసంగ్ కంపెనీ మార్కెట్‌లోకి తమ శక్తివంతమైన Galaxy F56 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది.  

2 /8

ఈ Samsung Galaxy F56 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ఇది 6.82-అంగుళాల QHD డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమై స్కోరింల్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

3 /8

దీంతో పాటు ఈ డిస్ల్పే 1280×3220 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు గొరిల్లా గ్లాస్ ప్రొక్షన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది క్రిస్టల్-క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 

4 /8

ఈ Galaxy F56 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు అదనంగా 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది  10x జూమ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

5 /8

ఇక ఫ్రంట్‌ భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫికి కూడా చాలా బాగా పని చేస్తుందట.  

6 /8

ఈ Galaxy F56 5G మొబైల్‌ 210W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనిని 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయోచ్చు.   

7 /8

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన స్టోరేజ్‌ వివరాల్లోకి వెళితే.. ఇది  రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల కానుంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 256GB స్టోరేజ్ తో, రెండవ వేరియంట్‌ 512GB స్టోరేజ్‌తో రాబోతోంది. ఇది రెండు సిమ్‌ కార్డు సపోర్ట్‌లతో విడుదల కానుంది. 

8 /8

ఈ మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని బేస్‌ వేరియంట్‌ రూ.39,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హై ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.43,999తో విడుదల కానుంది. అయితే ఈ ధరల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.