HYDRA 100 Days Completed: హైడ్రా ప్రారంభమై ఈరోజుకి వంద రోజులు కావస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ హైడ్రా.. హైదరాబాద్లోని ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు కీలకపాత్ర లక్ష్యంగా దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 విడుదల చేసి ఈ హైడ్రాకు కమిషనర్ గా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ రంగనాథును నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో హైదరాబాద్లోని అక్రమంగా నిర్మించిన భవనాలు, చెరువులపై కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ తొలగించే లక్ష్యంగా హైడ్రా ఉక్కు పాదం మోపింది. అంతేకాకుండా 99 రోజుల్లో ఈ హైడ్రా దాదాపు 300 పైచిలుకు అక్రమ నిర్మాణాలను తొలగించింది.
అంతేకాకుండా చెరువు చుట్టుపక్కల ప్రదేశాలు, నాలాల పక్కన ఉన్న భూములను, కబ్జాకు గురైన నిర్మానుష్య ప్రదేశాలను ఇలా దాదాపు 144 ఎకరాలకు పైగా భూముల్ని పరిరక్షించినట్లు హైద్ర వెల్లడించింది. అంతేకాకుండా అక్రమంగా కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ను సైతం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు చూస్తే హైడ్రాకు, రేవంత్ సర్కార్ కు ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. అలాగే పెద్ద పెద్ద వివాదాలను సైతం లెక్కచేయకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోయింది.. అంతేకాకుండా హైడ్రా ప్రారంభంలోనే నాగార్జునాకు సంబంధించిన ఎన్ కాన్వెంక్షన్ కూడా కూల్చివేసి సంచలనం సృష్టించింది.
పెద్ద పేద అని ఏమాత్రం తేడా లేకుండా హైడ్రా తన పనులు తాను చేసుకుంటూ.. భూముల పరిరక్షణ కోసం అక్రమార్కుల గుండెల్లో గుబులు లేపింది. హైడ్రా దూకుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేసింది. అంతేకాకుండా కొన్ని నగరాల్లో హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని ప్రజల్లో నుంచి డిమాండ్లు కూడా వెళ్ళు వేత్తాయి..హైడ్రాకు రాజకీయంగా చాలా ఫోర్స్ వచ్చినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ఆక్రమణల తొలగించే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్ళింది. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించిన కొందరి అక్రమ నిర్మాణాలను సైతం వదిలిపెట్టకుండా చర్యలు చేపట్టిందంటే.. ఎంత నిష్టగా హైడ్రా పని చేసిందో పెద్దగా పెద్దగా చెప్పనక్కర్లేదు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నిర్మించుకున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉండడం గమనించిన హైడ్రా ఆయనకు కూడా నోటీసులు పంపింది. అంతేకాకుండా ఖైరతాబాద్ లోని పార్కు స్థలాన్ని కూడా కాంపౌండ్ వాల్ కట్టి రక్షించింది. ఈ సమయంలో అధికార పార్టీలో ఉన్న ఓ ఎమ్మెల్యే పై కేసు కూడా పెట్టిందంటే ఎంత నిజాయితీగా హైడ్రామ్ ముందుకెళ్లిందో మనందరికీ తెలుస్తోంది.
అంతేకాకుండా శివరాంపల్లి లో హైడ్రా కూల్చివేత సమయంలో అడ్డుకున్న కొందరు ఎంఐఎం లీడర్లపై అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పై కూడా కేసులు పెట్టింది. హైడ్రా పనితీరుకు అనేక నెగిటివ్ ఆరోపణలు వచ్చిన ఏమాత్రం లెక్కచేయకుండా కూకట్పల్లిలోని సున్నం చెరువులో కట్టుకున్న గుడిసెలను కూడా తొలగించింది. దీనివల్ల అక్కడి ప్రజలు హైడ్రా తొలగించాలని ఫిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే సంగారెడ్డిలో కొన్ని భవనాలు కూల్చివేత సమయంలో హైకోర్టు హైడ్రా పై అనేక ప్రశ్నలను కురిపించింది.. దీనికి హైడ్రా తన వంతుగా తాము కూల్చలేమంటూ సమాధానం కూడా ఇచ్చింది. దీనికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి కొంచెం ఘాటుగా కూడా ప్రశ్నించింది. ఇలా 100 రోజుల్లో హైడ్రా ఎన్నో అక్రమ నిర్మాణాలను తొలగించింది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
HYDRA 100 Days Completed: హైడ్రాకి 100 రోజులు పూర్తి.. స్వాధీనం చేసుకున్న వందల ఎకరాల భూములు ఇవే.. ఆశ్చర్యపోకండి గురూ..