కాంగ్రెస్ పై మోదీ ఫైర్

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.

Last Updated : Dec 22, 2019, 05:03 PM IST
కాంగ్రెస్ పై మోదీ ఫైర్

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ .. అరాచకం, గందరగోళం సృష్టించాలని భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన. . పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ .. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పుకార్లు సృష్టిస్తున్నాయని విమర్శించారు. దీంతో  దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై లేనిపోని అనుమానాలు పుట్టుకొస్తున్నాయన్నారు.   

దీదీ.. భయమెందుకు..?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు గురి పెట్టారు. బంగ్లాదేశ్ నుంచి శరణార్థుల రూపంలో చాలా మంది పశ్చిమ బెంగాల్ లోకి చొచ్చుకు వస్తున్నారని గతంలో ఐక్యరాజ్యసమితికి మమత వెళ్లారని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెకు ఏమైందని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో తన వైఖరి ఎందుకు మార్చుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పుకార్లు సృష్టించడానికి కారణమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి.. దాని కోసం ఎందుకు భయపడుతున్నారని చురకలంటించారు.

 

Trending News