హైదరాబాద్: దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడం సరైందేనంటూ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అదే సమయంలో మరోపక్క కొందరు ప్రముఖుల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిందితులకు చట్టపరంగా శిక్షపడితే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. బీజేపి ఎంపీ మేనకా గాంధీ ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ.. "చట్టాన్ని ఎవ్వరూ కూడా తమ చేతుల్లోకి తీసుకోకూడదని, నేరం రుజువైన తర్వాత నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష పడేది" అని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ కూడా అదే రకమైన స్పందనను తెలియజేశారు. ''నిందితులకు వీలైనంత త్వరగా మరణ శిక్ష విధించాలనే కోరుకున్నాం. అయితే, అది న్యాయపరంగా జరిగితే సబబుగా ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందనేది తెలియదు. అది పోలీసులు మాత్రమే చెప్పగలరు'' అని రేఖా శర్మ వ్యాఖ్యానించారు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్