Business Ideas: టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు కేంద్ర ప్రభుత్వం అందించే లోన్ తో ఈ బిజినెస్ చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం పక్కా

Business Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది తమ సొంత కాళ్ల పైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ముద్రా రుణాలు బయట లభించే ఇతర ప్రైవేటు రుణాలతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువ వడ్డీతోనూ సులభ వాయిదాలలో చెల్లించే అవకాశంతో ఉంటున్నాయి. ముద్ర రుణాలను తీసుకునేందుకు అటు నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
 

1 /6

Business Ideas: మీరు కూడా ముద్రా రుణం తీసుకొని మంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే.. ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. మీ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడి తోనే ప్రతినెల 1 లక్ష రూపాయలకు పైన ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి చక్కటి బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.   

2 /6

ప్రస్తుత బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సాంప్రదాయ వంటకాలను పిండి వంటలను తయారు చేసుకోవడం అనేది అరుదైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా మార్కెట్లో లభించే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా పాత తరంలో ఇళ్లల్లో చేసుకునే పిండి వంటలు రుచికరమైన స్నాక్స్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.  

3 /6

సాంప్రదాయ వంటకాలను చిరుతిండ్లను ప్రవేశపెడుతూ స్వగృహ హోమ్ ఫుడ్స్ వంటి ఒక స్వీట్ షాపును ఏర్పాటు చేసుకున్నట్లయితే ..చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. బయట మిఠాయి భండార్ వంటి మార్వాడి షాపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిండివంటలు స్వీట్లు లభించవు. అక్కడ కేవలం రాజస్థానీ గుజరాతి మార్వాడి స్టైల్ స్వీట్లు హాట్లు లభిస్తాయి. మాత్రమే లభిస్తాయి.

4 /6

మీరు కనుక ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే చిరుతిండ్లను సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే ..పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇష్టంగా తినే కాకినాడ కాజా, పూతరేకులు, బందరు లడ్డు, పాలకోవా, వంటి సాంప్రదాయ రుచులతోపాటు తెలంగాణలో లభించే సకినాలు, సర్వ పిండి, కట్టె గారెలు, వంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే.. మంచి సేల్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక షాపును అద్దెకు తీసుకొని దాంతోపాటు మరొక కిచెన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.   

5 /6

వంటలు చేయడం కోసం స్వీట్లు హాట్లు తయారు చేయగలిగే వంట వాళ్లను పని వాళ్ళను సహాయకులుగా పెట్టుకోవాలి. అలాగే మీరు కూడా కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు తయారీ మెలకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలంటే.. మీరు వారి నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకోవడం ద్వారా వారి అభివృద్ధికి తగ్గట్టు ప్యాకింగ్ చేసి అందించినట్లయితే.. పెద్ద ఎత్తున మీరు భవిష్యత్తులో ఆర్డర్లు పొందవచ్చు.  

6 /6

 అలాగే ఇదే షాపులో మీరు పచ్చళ్ళు పొడులను కూడా అందుబాటులో పెట్టడం ద్వారా మరింత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా మీరు ఎన్నారై లకు సైతం ఆహార పదార్థాలను సప్లై చేయవచ్చు. తద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందడంతో పాటు ఆదాయం కూడా పొందుతారు.