Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..

Muthyalamma incident: ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేసిన ఘటన హైదరబాద్ లో రచ్చగామారింది. దీన్ని అన్ని హిందు సంఘాలు కూడా ఖండించాయి. దీనిలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లో బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో హిందుసంఘాలపై పోలీసులు లాఠీచార్జీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 19, 2024, 02:21 PM IST
  • సికింద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు..
  • సలీంపై చర్యలు తీసుకొవాలని డిమాండ్..
Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..

Muthyalamma idol vandalised issue protest at secunderabad: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ, ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన  ఘటన పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి.ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన సలీం అనే వ్యక్తిని స్థానికలు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. అతగాడు పోలీసుల విచారణలో పొంతనలేని విధంగా మాట్లాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

 

ఈ క్రమంలో.. ఈరోజు ముత్యాలమ్మ ఆలయ విగ్రహాం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందు సంఘాలు సికింద్రాబాద్ బంద్ నకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా..అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని భారీగా నినాదాలు చేస్తు నిరసనలు చేపట్టాయి. ఘటనకు కారణమైన సలీంను ఆస్పత్రిలో ఉంచారని, బొక్కలో వేసి కఠినంగా పనిష్మెంట్  ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

సలీంతో పాటు.. మరికొందరికి హిందు మతంపై ఆగ్రహం కలిగేలా సెమినార్ లు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన లాడ్జీవైపు హిందు సంఘాలు దూసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో  అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున నిరసన కారులు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. అయితే.. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు.. నిరసర కారులపై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Read more: Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..

దీంతో కొంత తొక్కిసలాట కూడా జరిగినట్లు సమాచారం. మరొవైపు.. పొలీసుల లాఠీచార్జీని మాత్రం హిందు సంఘాలు ఖండిస్తున్నారు. ఈ ఘటనపై  ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రులు స్పందించకపోవడం దారుణమని హిందు సంఘాలు ఖండిస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News