Diwali Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే దీపావళి బోనస్‌.. అదనంగా రూ.5,830 DA కూడా..

7Th Pay Commission Dearness Allowance And Diwali Bonus: అక్టోబర్ 16న జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గణనీయంగా 3 శాతంకు పైగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శుభవార్త వల్ల కోట్లాది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరుగుతుంది. 

1 /7

అక్టోబరు 16న కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు పై చేసిన కీలక ప్రకటనకు సంబంధించిన నిర్ణయం.. దీపావళి పండగ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.   

2 /7

కేంద్ర ప్రభుత్వం పెంచిన  డియర్‌నెస్ అలవెన్స్‌ జూలై 1వ తేది నుంచి వర్తిస్తుంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మూడు నెలల పాటు అరియర్స్‌తో పాటు జీతాలు అందుతామి. అంతేకాకుండా కొత్త DAతో కాస్త జీతం కూడా పెరుగుతుంది.   

3 /7

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఉద్యోగుల డీఏ 53 శాతంకు పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే ఉండేది. కానీ ఇటీవలే ప్రకటనతో దాదాపు 3 శాతం వరకు పెరిగింది.   

4 /7

ఇక DAకి సంబంధించిన లెక్కల (7Th Pay Commission Salary Calculator) వివరాల్లోకి వెళితే..(బెసిక్‌ చెల్లింపు + గ్రేడ్ పే) × DA శాతం = DA మొత్తం)గా లెక్కిస్తారు. ఇదే గణన ప్రకారం, ప్రతి ఉద్యోగి డీఏను లెక్కిస్తారు. 

5 /7

ఇదే లెక్కల ప్రకారం చూస్తే బేసిక్‌ పే రూ. 10,000 పైగా ఉంటే.. ఇక గ్రేడ్‌ పే మాత్రం రూ.1 వేయి అనుకుంటే.. మీ టోటల్‌ జీతం కేవలం రూ.11 వేలు అవుతుంది. ఇక 53 శాతం DA రూ. 5 వేలు అవుతుంది. దీంతో నెలకు మీ జీతం రూ. 16,830 అవుతుంది.  

6 /7

డియర్‌నెస్ అలవెన్స్ అనేది ఒక ఉద్యోగి వివిధ ప్రమాణాలపై పెరుగుతున్న సరుకుల ఖర్చులతో పాటు ద్రవ్యోల్బణాన్ని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడానికే  ఈ DA ద్రవ్య ప్రయోజనమని ఆర్థ శాస్త్రంలో పేర్కోన్నారు.   

7 /7

డీఏ లెక్కలను కేంద్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తుంది. అయితే ఇలా చేసే సవరణల్లో పట్టణ ప్రాంత ఉద్యోగులకు, సెమీ-అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు DAలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.