DA Hike: ప్రతి సంవత్సరం దీపావళికి.. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్.. ఉద్యోగులకు, పెన్షనర్లకు బహుమతి ప్రకటించే సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే చెయ్యనుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈసారి పెన్షనర్లకు.. డియర్ నెస్.. ఏకంగా మూడు శాతం పెంచుతుంది అని సమాచారం.
సాధారణంగా ప్రతి ఏడాది దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వాలు దీపావళి బహుమతి ప్రకటిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూడా దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ లో 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపింది.
ఇంతకుముందు డియర్ నెస్ అలవెన్స్ 50% ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు శాతం పెంపుతూ జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే ఈ డి ఏ మరియు డిఆర్ లను కలిపి వారిని కూడా ఇందులో తీసివేయడం బేసిక్ పే లో 53% పెంచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగబోతోందని సమాచారం.
ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాలు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించగా.. పెరుగుతున్న ద్రవయోల్బనం మధ్య ఆర్థిక ఉపశమనంతో పాటు వారి మొత్తం పరిహారం ప్యాకేజీలను మెరుగుపరచడం జరిగింది.
ఇంక కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు తాజా ఏడవ పే కమిషన్ అప్డేట్ లో జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్, అలాగే పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ మూడు శాతం పెంచుతూ.. ప్రకటించిన ఈ డిఏ పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లు దీపావళికి ముందు మూడు నెలల జీతంతో పాటు బకాయిలు కూడా అందుకో బోతున్నారు.
రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే, 2017 ఆధారంగా జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు ఈ డియర్ నెస్ అలవెన్స్ లో నాలుగు శాతం పెంపుదలను ఒడిస్సా ప్రభుత్వం ఆమోదించింది. గతంలో డిఎ 46 శాతం ఉండగా , ఇప్పుడు 50% పెంచుతూ జనవరి 1 2024 నుండి అమలులోకి తెచ్చింది.
అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా డియర్ నెస్ అలవెన్స్ లో 4శాతం పెరుగుదల ప్రకటించారు. ఇది జనవరి 1 2023 నుండి అమలులోకి వస్తుంది. అదనంగా ప్రభుత్వ ఉద్యోగుల వైద్య బిల్లులు , పెన్షన్ 75 యేళ్లు నిండిన వారికి బకాయిలు వెంటనే చెల్లిస్తామని కూడా తెలిపారు.
అలాగే జార్ఖండ్లో 9% , ఛత్తీస్గఢ్లో 4 శాతం , సిక్కిం లో 4 శాతం అలవెన్స్ పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 1 2024 నుండి అమలులోకి వచ్చాయి.