Ravi Teja Recent Movies Collections: రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్.. మిస్టర్ బచ్చన్ ప్లేస్ ఎక్కడంటే..

Ravi Teja Recent Movies Collections: రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కా బోర్లా పడింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..  

 

1 /5

మిస్టర్ బచ్చన్.. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’.  ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 8.06 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

2 /5

ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసిన ఈ చిత్రం 16.89 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి యావరేజ్ గా నిలిచింది.

3 /5

టైగర్ నాగేశ్వరరావు .. రవితేజ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 25.50 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి యావరేజ్ గా నిలిచింది. 

4 /5

రావణాసుర.. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 12.02 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. 

5 /5

ధమాకా... రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నక్కిన త్రినాథ రావు నటించిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.06 కోట్ల షేర్ రాబట్టింది.