Bigg Boss Amardeep Naa Nireekshana: బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా మరో చిత్రం రానుంది. నా నిరీక్షణ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ లాంచింగ్ గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి. పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పి.సంతోష్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమర్‌దీప్‌కు జంటగా లిషి గణేష్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. సాయి వర్మ దట్ల దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా మూవీ పూజా కార్యాక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు. రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేయగా.. ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Also Read: Festive Fashion: దసరా నాడు హీరోయిన్ల ట్రెడిషనల్ లుక్స్.. పండుగకు మరింత అందం
డైరెక్టర్ సాయి వర్మ దట్ల మాట్లాడుతూ.. దసరా పండుగ అయినా తను ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు, దిల్ రాజు, రాజా రవీంద్రకు థ్యాంక్స్ చెప్పారు. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నామని చెప్పారు. హీరో అమర్ దీప్ మాట్లాడుతూ.. హీరోగా తనకు ఇది రెండో సినిమా అని చెప్పారు. బిగ్‌బాస్ తరువాత తాను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది అన్నారు. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే 7 నెలలు పని చేశారని.. వారి వల్లే ఈ మూవీ ఇక్కడికి వరకు వచ్చిందని చెప్పారు. తనను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ లిషి గణేష్ కల్లపు మాట్లాడుతూ.. ఈ సినిమా తన రెండో మూవీ అన్నారు. ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. చైతన్య వర్మ మాట్లాడుతూ.. ఇది వరకు తనను హిట్, ఝాన్సీ, సరెండర్ వంటి సినిమాల్లో చూశారని.. ఈ మూవీలో తనకు మంచి పాత్ర లభించిందన్నారు. ఈ సినిమాకు తిరుమలేష్ బండారు మాటలు అందిస్తున్నారు. వి.రవి కుమార్ కెమెరామెన్‌గా వర్క్ చేయనున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
నటీనటులు: అమర్దీప్ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్ కల్లపు, రమ్య ప్రియ తదితరులు
సాంకేతిక నిపుణులు:
==> బ్యానర్ : పీకాక్ మూవీ మేకర్స్
==> ప్రొడ్యూసర్: పి.సంతోష్ రెడ్డి
==> కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :సాయి వర్మ దాట్ల
==> మాటలు : తిరుమలేష్ బండారు
==> కెమెరామెన్ : వి.రవి కుమార్
==> మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
==> PRO: మోహన్ తుమ్మల
Also Read: Priests: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో అధికారులకు చెక్ పూజారులదే అధికారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి