Train Loco Pilot: దేవీ నవరాత్రి ఉత్సవాలు.. దసరా సంబరాలతో కోలాహలంగా ఉన్న విజయవాడలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. విధుల నిర్వహణకు వెళ్తున్న రైలు లోకో పైలెట్‌పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడరు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలపాలైన లోకో పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడ ఉలిక్కిపడింది. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి బ్యాచ్ ఎలా రెచ్చిపోతుందో కళ్లకు కట్టినట్టు కనిపించింది. పండుగ రోజు విషాదం నింపింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Scarlet Snake: సొగసైన అందాలతో బుసలు కొడుతున్న పాము.. భయపడక్కర్లేదు విషం లేదు
ప్రాథమిక సమాచారం ప్రకారం... దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో లోకో పైలట్ డి. ఎబినేజర్ విధులు నిర్వహించేవాడు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో లోకో పైలెట్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. విజయవాడ స్టేషన్‌లోని నైజాం గేట్ సమీపంలో రైల్వే రోడ్ నెంబర్ 11లో ఎబినేజర్ వెళ్తున్నారు. వెనుక నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ ఆగంతకుడు ఇనుప కడ్డీతో బలంగా తలపై మోదాడు.
Also Read: Honey Trap: వైజాగ్‌లో కిలేడీ హల్‌చల్.. అబ్బాయిలకు మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోలతో
అనంతరం రాళ్లు, ఇనుప కడ్డీలతో విచక్షణ రహితంగా ఎబినేజర్‌పై అతడు దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున కావడంతో ఎవరూ ఈ ఘోరాన్ని చూడలేకపోయారు. తీవ్ర గాయాలపాలైన ఎబినేజర్ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడి సిబ్బంది గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎబినేజర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రైల్వే ఆస్పత్రి వైద్యులు అతడు చనిపోయినట్లు ప్రకటించారని సమాచారం.
హత్యకు కారణాలు?
అయితే ఎబినేజర్ హత్య జరిగిన తీరు చూస్తే కక్ష సాధింపు.. పగ బట్టినట్టు హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వెనుక నుంచి అత్యంత దారుణంగా హతమార్చడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్రణాళికా ప్రకారం ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. డబ్బు లేక ఏదైనా విలువైన వస్తువుల కోసం హత్య చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం లోకో పైలెట్ మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ దారుణం గంజాయి బ్యాచ్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సంఘటనతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే లోకో పైలట్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమకు రక్షణ లేదని.. తరచూ గంజాయి బ్యాచ్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి