Ktr filed defamation case against Konda Surekha: మంత్రి కొండా సురేఖకు వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకొవచ్చు. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావావేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు ఈ పిటీషన్ వేసినట్లు సమాచారం.
మరోవైపు ఈరోజు నాంపల్లిలో మరోసారి నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో.. స్పెషల్ కోర్టు వారు ఈ రోజున మధ్యహ్నాం విచారణ జరపనున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా పరువు నష్ట దావా వేయడం మాత్రం కొండా సురేఖకు పుండు మీద కారం, ములిగే కుక్క మీద తాగి కాయ పడటం లాంటిదని.. అని కొంత మంది బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ గతంలో మాట్లాడుతూ.. కేటీఆర్ వల్లే.. సమంతా నాగచైతన్యలకు విడాకులు జరిగాయన్నారు. అంతే కాకుండా.. కేటీఆర్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఆయన వల్ల హీరోయిన్ లంతా.. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతున్నారన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై సినిమా రంగంలోనే కాకుండా.. రాజకీయ పరంగా కూడా రచ్చగా మారింది.
దీనిపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కేటీఆర్ తాజాగా, నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయడం చర్చ నీయాంశంగా మారింది. ఈ కేసులో.. బీఆర్ఎస్ నేతలు బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను ఎవిడెన్స్ లుగా చేర్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ను పెంచేవిగా మారిపోయాయని చెప్పుకొవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాత్రం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రెండు పార్టీలు సైతం ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదని చెప్పుకొవచ్చు. గత సర్కారు హయాంలోనే అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే.. బీఆర్ ఎస్ కూడా అదే రేంజ్ లో తిప్పికొడుతుంది.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. కాంగ్రెస్ లేనీ పోనీన ఆరోపణలు చేస్తుందంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.