Ratan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరు కూడా జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే రతన్ టాటా చెప్పిన ఈ విషయాలను నిద్రలో కూడా మర్చిపోకూడదు.
Ratan Tata Motivational Quotes: రతన్ టాటా వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు కోట్లలో ఉంటారు. రతన్ టాటాను ఎంతోమంది తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. రతన్ టాటా కొన్ని కోట్స్ నుండి ప్రేరణ పొందేందుకు మనమూ ప్రయత్నిద్దాం.
భారతీయ కుబేరుల్లో ఒకరు రతన్ టాటా. తన జీవిత కాలంలో ఎన్నో ఇంటర్వ్యూలను ఇచ్చారు. తన జీవిత విశేషాలను పంచుకున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటాకు మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భంగా గురించి అడగ్గా..దానికి రతన్ టాటా ఓ స్పూర్తివంతమైన అనుభవాన్ని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ అచరణీయమైనది చెప్పవచ్చు. రతన్ టాటా నుండి మీరు వ్యాపారం మాత్రమే కాకుండా జీవన విధానాన్ని కూడా నేర్చుకోవచ్చు. రతన్ టాటా చెప్పిన ఈ విషయాలను మీరూ పాటిస్తే ..మీరు విజయాన్ని ఎవరూ ఆపలేరు.
కష్టసుఖాలను సమానం చూడండి: జీవితంలో ముందుకు సాగాలంటే హెచ్చు తగ్గులు తప్పనిసరని రతన్ టాటా చెప్పేవారు. ECGలో సరళ రేఖ అంటే మనం సజీవంగా లేము. రతన్ టాటా ఈ కోట్ ప్రకారం, మీరు హెచ్చు తగ్గులను అంగీకరించడానికి ప్రయత్నించాలి.జీవితంలో వైఫల్యం చెందామని కుంగిపోకుండా..ముందుకు సాగడం నేర్చుకోండి.
మిమ్మల్ని మీరు విశ్వసించాలి: సరైన నిర్ణయాలు తీసుకోవడంపై ఇతరులపై తనకు నమ్మకం లేదని..తన నిర్ణయాలు తానే తీసుకుంటానని..వాటిని సరైన దిశగా అమలు చేసి రుజువు చేస్తానని రతన్ టాటా చెప్పేవారు. ఈ కోట్ ప్రకారం, మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలపై మీకు నమ్మకం ఉంటే, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఈ రోజు కాకపోయినా రేపు విజయం అనేది తథ్యం.
అందరినీ వెంట తీసుకెళ్లండి: వేగంగా ప్రయాణం చేయాలంటే ఒంటరిగా ప్రయాణించాలని రతన్ టాటా చెప్పేవారు. కానీ మీరు చాలా దూరం ప్రయాణించాలనుకుంటే, మీరు అందరితో కలిసి ప్రయాణించడానికి ప్రయత్నించాలి.
సవాలును అవకాశంగా మార్చుకోండి: ప్రజలు మీపై రాళ్లు రువ్వితే, ఆ రాళ్లను మీ రాజభవనాన్ని నిర్మించుకోవాలని రతన్ టాటా అన్నారు. మొత్తంమీద, మీరు విజయానికి మీ ప్రయాణంలో కనిపించే అడ్డంకులు లేదా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి.
రతన్ టాటా యొక్క ఈ విలువైన ఆలోచనల నుండి రాబోయే అనేక తరాలు చాలా నేర్చుకోవచ్చు. అటువంటి ఆలోచనలను అమలు చేయడం ద్వారా, మీరు మీ వృత్తిలో విజయం సాధించడమే కాకుండా ప్రజల హృదయాల్లో కూడా స్థానం సంపాదించగలరు.