EPFO Money Withdraw: ఉద్యోగ భవిష్యనిధి ద్వారా డబ్బులు నెలనెలా ఉద్యోగుల జీతం డబ్బుల నుంచి ఎంప్లాయర్ నుంచి కొంత డబ్బు జమా అవుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు పొందవచ్చు. పెళ్లి, ఆరోగ్యం, ఇంటి నిర్మాణం అవసరాలకు ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
EPFO Money Withdraw: ఈపీఎఫ్‌ఓ ద్వారా పీఎఫ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలన్స్ ఎంక్వైరీ తదితర వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అయితే, సింపుల్‌గా ఇంట్లో కూర్చొని కేవలం మొబైల్ ద్వారా మీ పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌ఓ ద్వారా ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి కొంతమేరా డబ్బు జమా అవుతుంది. ఉద్యోగులు అత్యవర సమయంలో ఈ డబ్బులను తిరిగి తీసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్‌ఓ ఆన్లైన్ ద్వారా అప్లే చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ పీఎఫ్ డబ్బులను కేవలం ఇంట్లోనే బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేవలం రెండు నిమిషాల్లో మీ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌ఓ ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఇంట్లో నుంచి సులభంగా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, ఈ యాప్ ఉపయోగించడానికి ముందుతగా ఇ నామినేషన్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే ఈ వెసులుబాటు మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పీఎఫ్ బ్యాలన్స్, విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ వినియోగించుకోవడానికి ముందుగా మీరు ఈపీఎఫ్‌ఓ సభ్యత్వం కలిగి ఉండాలి. మీ ఫోన్ ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ (Umang) యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
మీరు లాగిన్ అయిన తర్వాత ఈపీఎఫ్‌ఓ సర్వీస్ పొందుతారు. మీకు కావాల్సిన సేవలను పొందవచ్చు. పీఎఫ్ బ్యాలన్స్ ఎంక్వైరీ, విత్‌డ్రా, స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
ఈపీఎఫ్‌ఓ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. సర్వీస్ ఆప్షన్‌లోకి వెళ్లి క్లెయిమ్ ఎంచుకోవాలి. ఇలా చేసిన తర్వత యూఏఎన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. కావాల్సిన వివరాలు నమోదు చేసి ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇపోర్టల్ యాప్ ద్వారా క్లెయిమ్ చేసుకునే విధానం.. ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్, ఓటీపీ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు కేవైసీ ఆప్షన్‌ను కూడా వెరిఫై చేసుకోవాలి.