Millet Upma Recipe: మిల్లెట్ ఉప్మా ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్. ఇది సులభంగా తయారు చేయవచ్చు. బరువు తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. మిల్లెట్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాని తగ్గిస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్‌ను అదుపు చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.
మిల్లెట్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, కణాలను రక్షిస్తాయి. మిల్లెట్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ ఉప్మాను ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్‌లోకి తీసుకోవచ్చు. సాధారణ ఉప్మాతో పోలుస్తే ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. పిల్లలు, పెద్దలు కూడా దీని తినవచ్చు. తయారీ విధానం ఎంతో సులభంగా ఉంటుంది. దీని కోసం ఎలాంటి అధిక పదార్థాలు ఉపయోగించాల్సి అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మిల్లెట్ రవ్వ (కొర్రబియ్యం రవ్వ)
నూనె
కరివేపాకు
శనగలు
ముక్కలు చేసిన కూరగాయలు (ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్)
అల్లం-వెల్లుల్లి పేస్ట్
పసుపు
కారం పొడి
ఉప్పు
నీరు
కొబ్బరి తురుము (ఆప్షనల్)
కారం పప్పు (ఆప్షనల్)
తయారీ విధానం:
ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయాల్సి ఉంటుంది. ఇందులో మిల్లెట్ రవ్వను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేరొక పాత్రలో నూనె వేసి వేడి చేసి అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, శనగలు వేసి వేగించండి. తర్వాత ముక్కలు చేసిన కూరగాయలను వేసి వేగించండి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. వేయించిన మిల్లెట్ రవ్వను కూరగాయల మిశ్రమంలో వేసి బాగా కలపండి. తగినంత నీరు పోసి మూత పెట్టి ఉడికించండి. నీరు ఆవిరి అయిపోయే వరకు ఉడికించండి. ఉప్మాను గిన్నెలోకి తీసి, కొబ్బరి తురుము, కారం పప్పుతో అలంకరించి వడ్డించండి.
చిట్కాలు:
ఇష్టమైన కూరగాయలను ఉపయోగించవచ్చు.
మిల్లెట్ రవ్వను ముందుగా నీటిలో నానబెట్టి ఉడికించినా కూడా చేయవచ్చు.
ఉప్మాను తీపిగా కూడా తయారు చేయవచ్చు. దీని కోసం చక్కెర,బాదం పొడిని వేసి కలపండి.
ఉప్మాను పకోడీలు, చట్నీలతో కలిపి తినవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.