Navaratri 2024: నవరాత్రి 5వ రోజు మహాచండీ అలంకరణ.. పూజావిధానం, నైవేద్యం..

Navaratri 5th day alankarana: నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 7వ తేదీ అమ్మవారి అలంకరణ మహాచండీ రూపంలో దర్శనమివ్వనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అలంకరణను ప్రతిపాదికన తీసుకుంటారు. కాబట్టి సోమవారం మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
 

1 /5

Navaratri 5th day alankarana: ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు నవదుర్గలను పూజిస్తారు. ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజిస్తారు. అయితే, 5వ రోజు మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.  

2 /5

నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే శత్రుపీడ తొలగిపోతుందని నమ్ముతారు. నవరాత్రులు పూజలు చేయలేని వారు కనీసం మూడు, ఐదు రోజులు అయినా పూజించాలి. ఇక ఐదవ రోజు మహాచండీ శక్తి స్వరూపిణీగా  పూజిస్తారు.  

3 /5

పురాణాల ప్రకారం ఈ చండీ దేవి మహిషాసురునితోపాటు ఎంతోమంది రాక్షసులను చంపింది. లోకకల్యాణం కోసం అమ్మవారు అవతరించారు. ఏకాగ్రతతో మీరు కూడా అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలతోపాటు మంచి ఆరోగ్యం కూడా అమ్మవారు ఇస్తుంది.  

4 /5

మహా చండీ అమ్మవారిని పూజించడం వల్ల కాలసర్పదోషం, కుజదోషం తొలగిపోతుంది. ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీరను ధరింపజేస్తారు. అంతేకాదు ప్రసాదంగా పులిహోర, గారెలు సమర్పించాలి. అయితే, ఈరోజు స్కంద మాతను కూడా పూజించే ఆచారం ఉంది.   

5 /5

నవరాత్రుల్లో కలశస్థాపన చేసుకుని పసుపు, కుంకుమ, అక్షితలతో కలిపి అమ్మవారిని పూజిస్తారు. కాగా, నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3న ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 12 శనివారం దసరా పండుగను జరుపుకోనున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)