Charlapalli railway station: త్వరలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం.. తెలంగాణకు కేంద్రం వరాలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..


Charlapalli railway station: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నవరాత్రుల సందర్భంగా తెలంగాణకు పలు వరాల ఝల్లును కురిపించింది. అంతేకాదు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లపై ఒత్తిడి తగ్గించడానికి నగర శివారు చర్లపల్లిలో మరో రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన వివరాలతో పాటు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.

1 /6

Charlapalli railway station: భాగ్యనగర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న మరో రైల్వే టెర్మినల్ చర్లపల్లి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి కానున్నాయి. ఎపుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామన్నారు. అంతేకాదు రూ. 2,220 కోట్లతో  తెలంగాణలో 40 పైగా రైల్వే స్టేషన్లలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామన్నారు.

2 /6

తెలంగాణలో రైల్వేలో పురోగతి కనిపిస్తోంది. కొత్త లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే రీజియన్ లో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావొచ్చిందన్నారు. వందకు పైగా రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పించినట్టు చెప్పారు.

3 /6

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణకు రూ. 715 కోట్లు.. కాచిగూడ కు రూ. 425 కోట్లు.. నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ. 429 కోట్ల ఖర్చు పెట్టినట్టు తెలిపారు. కొత్తగా అత్యాధునిక వసతులతో రూ. 415 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి పనులు పూర్తి కావొచ్చాయి. 

4 /6

దేశ వ్యాప్తంగా ఎక్కువ వందే భారత్ రైల్లు.. సికింద్రాబాద్ నుంచి 5 వెళుతున్నాయి. తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రియారిటీకి నిదర్శనం అన్నారు. ఇక్కడ వందేభారత్ రైల్లు 100 శాతం ఆక్యుపెన్షీ తో ప్రయాణిస్తున్నట్టు తెలిపారు.

5 /6

పలు కొత్త రైల్వే మార్గాలకు సర్వే పూర్తైయిట్టు సమాచారం.  రూ.521 కోట్లతో కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా.. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కేంద్రం ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిపారు. పీఎం నరేంద్ర మోడీ గారు దీన్ని పీరియాడిక్ ఓవర్ హాలింగ్ గానే కాకుండా.. RMU గా అప్ గ్రేడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ వ్యాగన్ల ఓవర్ హోలింగ్‌తో పాటు.. కోచెస్, ఇంజన్స్ వ్యాగన్స్ తయారు కానున్నాయి. దీని ద్వారా.. 3వేల మందికి ప్రత్యక్షంగా.. మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభించబోతున్నట్టు తెలిపింది.

6 /6

దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు  900 కిలోమీట‌ర్ల మేర‌ రైల్ నెట్ వ‌ర్క్ ను విస్తరించేలా ప్లాన్ చేశారు. రూ. 24,600 కోట్ల విలువైన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. తెలంగాణ నుంచి కూడా ఓ రైల్వే లైను ఉంది. రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో.. భద్రాచలం-మల్కాన్‌గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్టు తెలిపింది.