Rewind Movie Trailer: వైవిద్యమైన కథలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే.. ఆ సినిమాలకు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు అదే థియరీని ఫాలో అవుతోంది.. రివైన్ అనే సినిమా. సరికొత్త కాన్సెప్ట్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకి త్వరలో రానుంది. సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నకిష్టోన్న ఈ చిత్రాన్ని క్రాస్ వ క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మించడమే కాకుండా.. ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకి ఆశీర్వాద్ సంగీతం అందిస్తుండగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. అలానే తుషార పాలా ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రంలో.. ఫన్ బకెట్ రాజేష్, అభిషేక్ విశ్వకర్మ, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, భరత్.. ఇతరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ సైతం విరుదలై ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ తో పాటు సినిమా యూనిట్.. ఈ చిత్రం 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది అని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర ఎడిటర్ తుషార పాలా మాట్లాడుతూ : “కళ్యాణ్ చక్రవర్తి సార్ ని.. రెండు సంవత్సరాల ముందు నేను కలిసినప్పుడు.. స్క్రీన్ ప్లే చెప్పాడు.. నాకు అప్పుడే ఈ సినిమా చాలా నచ్చింది. కొత్త టీం గా అందరం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాము,” అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ : “నాకు, డైరెక్టర్ గారికి, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అందరికీ ఇది బిగ్ స్క్రీన్ పైన మొదటి సినిమా. ఈ సినిమాకి అందరం కష్టపడి పని చేశాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము,” అని చెప్పుకొచ్చింది.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ : “ మా చిత్ర యూనిట్ చాలా చిన్నదే అయినా ఒక మంచి లైన్‌తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని తీశాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. ఈనెల 18న ఈ సినిమా చూసి మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాము,” అని చెప్పుకొచ్చారు.
నిర్మాత, డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ : “మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టైం ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాము” అని చెప్పారు.
Also Read: Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.