Richest State in India: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర .. తలసారి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్

Richest State: దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా, తెలంగాణ మాత్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న ప్రజలు తెలంగాణలో ఉన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 

Written by - Bhoomi | Last Updated : Oct 5, 2024, 05:24 PM IST
  Richest State in India: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర .. తలసారి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్

Maharashtra is the richest state in the country:  దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది.  42.67 లక్షల కోట్ల రూపాయల జిఎస్ డిపి అంచనా తో మహారాష్ట్ర జాతీయ జిడిపిలో 13.30 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. అయితే జిడిపి తలసరి ఆదాయంలో మాత్రం తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.  తెలంగాణలో తలసరి ఆదాయం 3.83 లక్షల రూపాయలుగా ఉంది.  ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం. 

ఇక తలసరి ఆదాయం పరంగా చూసినట్లయితే తమిళనాడు రెండో స్థానంలో ఉంది.  తమిళనాడు 3.50 లక్షల తలసరి ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. అటు జిఎస్ డిపి లో కూడా 31.55 లక్షల కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచి జాతీయ జిడిపిలో 8.90 వాటాను దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక 28.09 లక్షల కోట్ల జిఎస్ డిపి నమోదు చేసింది. తలసరి ఆదాయం విషయానికి వస్తే 3.31 లక్షల రూపాయలు నమోదు చేసింది. ఇది జాతీయ జిడిపిలో 8.20 శాతంగా నిలిచింది. 

ఇక గుజరాత్ ఉత్తర ప్రదేశ్ జిఎస్ డిపి ర్యాంకింగుల్లో నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ 27.9 లక్షల కోట్ల జిఎస్డిపి సాధించగా తలసరి ఆదాయం విషయానికి వస్తే 3.13 లక్షలు గా ఉంది. ఇక ఉత్తర ప్రదేశ్ GSDP పరంగా 24.99 లక్షల కోట్లతో ఐదవ సంపన్న రాష్ట్రంగా నిలిచింది. కానీ తలసరి ఆదాయం విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్ అత్యంత కనిష్టంగా 96 వేల రూపాయలు మాత్రమే ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ 16.5 లక్షల కోట్లతో జిఎస్డిపి పరంగా ఎనిమిదవ స్థానంలో నిలవగా.. తలసరి ఆదాయం విషయంలో 3.83 లక్షల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ 15.89 లక్షల కోట్లతో 9వ స్థానంలో నిలవగా 2.7 లక్షల రూపాయల తలసరి ఆదాయంతో ఆరవ స్థానంలో నిలిచింది. 

Also Read:   Supreme Court: ఇదే చివరి హెచ్చరిక.. ఓపిక నశించింది.. రాష్ట్రాల సీఎస్‎లకు సుప్రీం చివాట్లు..అసలేం జరిగిందంటే?  

అయితే మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవడానికి ప్రధానంగా అక్కడ ఉన్న పరిశ్రమలు అదేవిధంగా ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై కేంద్రంగా జరిగే వ్యాపారము ఆ రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలిపేందుకు దోహదపడ్డాయి.  దీంతో మహారాష్ట్ర దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా అవతరించింది. ఇక అదే సమయంలో అత్యధిక తలసరి ఆదాయం తో తెలంగాణ కూడా చరిత్ర సృష్టించింది.  తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి అదేవిధంగా ఐటి ,ఫార్మా,  ఇండస్ట్రియల్ రంగాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు.  దీంతో దేశంలోనే తలసరి ఆదాయం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

Also Read: Swiggy Bolt: బిర్యానీ ప్రేమికులకు గుడ్ న్యూస్..10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News