Vettaiyan Trailer: నన్ను ఎక్కడికి పంపినా నేను పోలీస్‌నే సార్‌.. 'వేట్టయన్‌'తో సూపర్‌స్టార్‌ మరో హిట్‌?

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సంబంధించిన వేట్టయన్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 'లాల్‌ సలామ్‌' ఘోర పరాభవం ఎదుర్కొన్న రజనీకాంత్‌ ఎలాగైనా హిట్‌ కొట్టాలని టీజే జ్ఞానవేల్‌తో కలిసి 'వేట్టయన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ట్రైలర్‌ విడుదలైంది. మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 2, 2024, 07:37 PM IST
Vettaiyan Trailer: నన్ను ఎక్కడికి పంపినా నేను పోలీస్‌నే సార్‌.. 'వేట్టయన్‌'తో సూపర్‌స్టార్‌ మరో హిట్‌?

Rajinikanth Vettaiyan Trailer: అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సంబంధించిన వేట్టయన్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 'లాల్‌ సలామ్‌' ఘోర పరాభవం ఎదుర్కొన్న రజనీకాంత్‌ ఎలాగైనా హిట్‌ కొట్టాలని టీజే జ్ఞానవేల్‌తో కలిసి 'వేట్టయన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ట్రైలర్‌ విడుదలైంది. మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపించారు.

Also Read: Akkineni Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పాలని డిమాండ్‌

ఓ నేరస్తుడిని పోలీస్‌ శాఖ పట్టుకునే కథాంశంతో వేట్టయన్‌ సినిమా రూపుదిద్దుకుంటోందని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. మహిళలపై అఘాయిత్యాలు, కామాంధులపై విరుచుకుపడే పోలీస్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌తో మరింత అంచనాలు పెంచేసింది. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాతో తమిళ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. 'ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి' అని డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది.

Also Read: Dhanaraj: ధనరాజ్ కొడుకు పేరు వెనుక పెద్ద కథ.. హీరో రామ్ చేసిన షాకింగ్ పనిని బయటపెట్టిన కమెడియన్!

ఈ సినిమాలో రజనీకాంత్‌తోపాటు ఫర్హాద్‌ అలీ, రానా, అమితాబ్‌ బచ్చన్‌ మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. మరోసారి రజనీ పోలీస్‌ పాత్రలో ఫుల్‌ జోష్‌లో నటించారు. డైలాగ్స్‌, నడక, ఫైట్స్‌ ప్రేక్షకులు, రజనీ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. లాల్‌ సలామ్‌ సినిమాతో కెరీర్‌లో భారీ ఫ్లాప్‌ అందుకున్న రజనీకాంత్‌కు 'వేట్టాయన్‌'తో మరో హిట్‌ అందుకోనున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. జైభీమ్‌ సినిమాతో సంచలన విజయం అందుకున్న జ్ఞానేవల్‌తో కలిసి నటిస్తుండడంతో ఈసారి రజనీకాంత్‌కు సూపర్‌ హిట్‌ దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌తో రజనీకాంత్‌ 'కూలీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

నిలకడగా ఆరోగ్యం
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన అనంతరం సూపర్‌ స్టార్‌ కోలుకుంటారని సమాచారం. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని రజనీ కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా రజనీ తిరిగి ఆరోగ్యవంతుడు కావాలని కోరుతూ ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ఆస్పత్రికి తరలివస్తున్నారు.

 

ట్రైలర్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News