Are You Willing To Start A New Wine Shop Business Here Full Details: మద్యం వ్యాపారం సిరులు కురిపించేది. ఒక్కసారి పెట్టుబడి పెడితే వరుసగా లాభాలు వచ్చే వ్యాపారం ఇది. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా మద్యం వ్యాపారం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు విధానం.. దుకాణాల కేటాయింపు ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అద్భుత అవకాశం: కొత్త వ్యాపారం కోసం ఆలోచిస్తున్న ఔత్సాహికులకు అద్భుత అవకాశం లభించింది.
లాభాలే లాభాలు: మద్యం వ్యాపారం అనేది ఒక్కసారి పెట్టుబడి పెడితే భారీగా లాభాలు కురిపించే వ్యాపారం.
పెట్టుబడికి రెట్టింపు: రూ.లక్షలు మనవి కాదనుకుంటే రూ.కోట్లు సంపాదించే అవకాశం లభిస్తుంది. ఒక్కసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటే ఏపీ మద్యం దుకాణాలతో ప్రయత్నం చేయండి.
కొత్త పాలసీ; ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ జారీ: రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో కొత్త దుకాణాలు కేటాయిస్తారు.
పాత విధానం స్వస్తి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన మద్యం దుకాణాల విధానానికి స్వస్తి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది.
డిపాజిట్: మద్యం దుకాణం కోసం దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది.
తేదీలు ఇవే: మద్యం దుకాణాలకు దరఖాస్తులు అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమవగా.. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
లాటరీ: ఈనెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు అధికారులు లాటరీ తీస్తారు.
ఫీజు ఇలా: జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు ఉంటుంది.
ఆ రోజు నుంచే: ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఈనెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.