Mahalaya Amavasya 2024: పెత్తర అమావాస్యకు బిగ్ షాక్ ఇచ్చిన గాంధీ తాత.. ఆ రెండు లేకుంటే ఎలా?

Mahalaya Amavasya 2024: రేపు అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్య. ఈరోజు పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. ముఖ్యంగా ఈరోజున తిథి తెలియని వారికి కూడా నైవేద్యాలు వంటివి పెడతారు. అయితే, నైవేధ్యం అంటే ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ శాతం ముక్క, చుక్క ఉండాల్సిందే. 
 

1 /5

అయితే, రేపు మాత్రం డ్రై డే సందర్భంగా ఆ రెండూ బంద్‌ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్దలకు నైవేద్యం పెట్టేవారికి ఇది బిగ్‌ షాక్‌ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మందు షాపులు, చికెన్‌, మటన్‌ విక్రయాలు చేయరు.  

2 /5

ఈరోజు జాతిపిత గాంధీ తాత జన్మదినం సందర్భంగా డ్రై డే పాటిస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజును అహింస దినంగా ప్రకటించింది. అందుకే ఈరోజు చికెన్‌, మటన్‌ విక్రయాలు కూడా ఉండవు. అయితే, పెద్దలకు నైవేద్యాలు పెట్టేవారికి ఇది బిగ్‌ షాక్‌.   

3 /5

ప్రతి ఏడాది 15 రోజులపాటు పితరులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆశ్వీయజ పౌర్ణమి నుంచి మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య, పెత్తర అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు.  తిథి ప్రకారం పితరులకు నైవేధ్యాలు పెట్టలేనివారు ఈరోజు పెడతారు.  

4 /5

ముఖ్యంగా ఈరోజుల్లో మన పెద్దలు భూమిపై సంచరిస్తారని, మనల్ని ఆశీర్వదించడానికి వస్తారనే నమ్మకం ఉంది. ఈ 15 రోజులు పితరుల కోసం కేటాయించారు. మన దేశంలో కాశీ, గయా వంటి కొన్ని ప్రధాన ప్రదేశాల్లో పితృదేవతలకు తర్పణం సమర్పిస్తే కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు.  

5 /5

అందుకే పెత్తర అమావాస్య రోజు ప్రత్యేకంగా పేదలకు, బ్రాహ్మణులకు చనిపోయినవారిక ఆత్మలకు శాంతి చేకూరాలని దాన ధర్మాలు కూడా చేస్తారు. అయితే, మరుసటి రోజు అయిన గురువారం పితరులకు నైవేద్యం పెట్టడానికి చాన్స్‌ ఉంటుంది. లేదా ఈరోజు మంగళవారం అక్టోబర్‌ 1 వ తేదీ పెట్టవచ్చు. కానీ, గురువారం పెట్టడం చెల్లదని, ఈరోజు మాత్రమే పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మహాలయ అమావాస్య రోజు నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ప్రారంభమవుతాయి.