High court angry on hydra ranganath: తెలంగాణలో హైడ్రా హల్ చల్ కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైడ్రా ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతుందో అని.. జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని చెప్పుకొవచ్చ. ఇదిలా ఉండగా.. ఇటీవల కొంత మంది హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. తమ భవనం కోర్టు పరిధిలో ఉందని చెప్పిన కూడా.. హైడ్రా కూల్చివేసిందంటూ కూడా బాధితులు హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వర్చువల్ గా కానీ లేదా నేరుగా కానీ కోర్టు ఎదుట హజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) హైడ్రాపై విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు వారి ఎదుట వర్చువల్ గా హజరయ్యారు. ఈ క్రమంలో హైకోర్టు హైడ్రా .. పనితీరుపట్ల ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరు పట్ల సంతోషంగాలేమని చెప్పుకొచ్చింది. అయిన.. శని, ఆదివారం కూల్చివేతలేంటనీ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మరోసారి హైడ్రా చట్టబద్దతపై ప్రశ్నించిన ధర్మాసనం, పొలిటికల్ బాసుల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని చురకలు పెట్టింది.
అసలు చట్టం చెప్పేది ఏంటి.. మీరు చేస్తుంది ఏంటని, మీకు అసలు రూల్స్ తెలుసా..? అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాణలను కూల్చడానికి మీకు ఉన్న అర్హతలు, కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసి డిటెయిల్స్ చెప్పాలని తెలిపింది. మరోవైపు అమీన్ పూర్ లో ఇటీవల కోర్టు పరిధిలో ఉన్నభవనాన్ని హైడ్రా కూల్చివేయడంపై .. వాడి వేడిగా వాదనలు నడిచాయి.
అమీన్ పూర్ లో.. ఇల్లు నిర్మాణంను కలెక్టర్ చెబితేనే.. కూల్చేసినట్లు తహాసీల్దార్ చెప్పారు. దీంతో ధర్మాసనం.. కలెక్టర్ ఆదివారం కూల్చమని చెప్పాడా .. అని ప్రశ్నించింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా..తామడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని, అటు ఇటూ జంప్ లు చేయోద్దని కూడా హైకోర్టు తెల్చి చెప్పింది. తాము అమీన్ పూర్ ఘటనపై ప్రశ్నిస్తున్నామని, కావూరీ హిల్స్ విషయం గురించి మాట్లాడలేనది హైకోర్టు చురకలంటించింది. అదే విధంగా..
అమీన్పూర్ లో.. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చెయ్యాలని నోటీసులు ఇచ్చి.. 40 గంటల్లోనే ఎలా కూలుస్తారని తహసీల్దార్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతే కాకుండా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సైతం చివాట్లు పెట్టింది. శని, ఆదివారం కూల్చివేతలు, నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై ధర్మాసనం ఘాటుగానే హైడ్రా పై ప్రశ్నల వర్షం కురిపించింది. చనిపోయే వారికి ముందు.. చివరి కోరిక ఏంటని అడుగుతారు.. మీరు ఇంటి యజమానుల్ని అడిగి ఇవన్ని చేస్తున్నారా.. అని అడిగింది.
ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన కోర్టు తీర్పుకు వ్యతిరేకమని మీకు తెలియదా.. అంటూ ఘాటుగానే హైకోర్టు రంగనాథ్ కు చివాట్లు పెట్టింది. మరోవైపు మూసీపై లంచ్ మోషన్ పిటిషన్ లు 30 దాఖలయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను ఒక్కరోజులో మార్చాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని.. అసలు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించకుండా.. కూల్చివేతలేంటని ప్రశ్నించింది. వీటికి కౌంటర్ లు దాఖలు చేయాలని చెప్తు.. విచారణకు అక్టోబర్ 15 కు వాయిదా వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
High court: శని, ఆదివారం కూల్చివేతలేంటీ..?. హైడ్రాకు చుక్కలు చూపించిన తెలంగాణ హైకోర్టు.. ఏమందంటే..?
హైడ్రాను ఏకీపారేసిన హైకోర్టు..
మీ చట్ట బద్దతేంటని ఘాటు వ్యాఖ్యలు..