Devara Villain Saif Relation With YSR Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఫీవర్ నడుస్తోంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో మొదలైంది. అంతేకాదు పలు చోట్ల ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సైఫ్ అలీ ఖాన్. ఈయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
ఏంటి.. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ను వైయస్ కుటుంబానికి అనుబంధమేమిటా ఆలోచిస్తున్నారా.. అవును దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి చిత్రమైన అనుబంధమే ఉంది.
బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ షర్మిలా ఠాకూర్ కుమారుడే సైఫ్ అలీ ఖాన్. ఈమె అప్పటి మన దేశ క్రికెట్ గా కెప్టెన్ పనిచేసిన మన్సూర్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
షర్మిలా ఠాకూర్, పటౌడీల కుమారడే సైఫ్ అలీ ఖాన్. తల్లి బాటలో బాలీవుడ్ లో హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాప్ హీరోకు తక్కువ. సైడ్ హీరోకు ఎక్కువ అన్నట్టు దాదాపు కెరీర్ లో ఎక్కువగా సెకండ్ హీరోగానే నటించాడు సైఫ్ అలీ ఖాన్. అంతేకాదు ఈయన ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో లంకేశ్వరుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా హిందీ, తెలుగులో తెరకెక్కింది.
ఒక రకంగా ‘ఆదిపురుష్’ సినిమా సైఫ్ ఫస్ట్ తెలుగు మూవీ అని చెప్పాలేమో. ఆ సంగతి పక్కన పెడితే.. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ ఒకప్పటి యువతకు కలల రాణి.
అంతేకాదు దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి .. షర్మిలా ఠాకూర్ కు వీరాభిమాని. అందుకే తన కూతురుకు తన ఫేవరేట్ హీరోయిన్ అయిన షర్మిలా పేరు పెట్టుకున్నాడు. మన తెలుగు వాళ్లు అంతగా ఈ పేరు పెట్టుకోరు. ఉత్తరాది వాళ్లే పెట్టుకుంటారు. ఈ రకంగా దేవర విలన్ సైఫ్ కు వైయస్ఆర్ కు మధ్య ఉన్న చిత్రమైన అనుబంధం ఇదే.