Tollywood: నిర్మాతలు చదలవాడ శ్రీనివాస రావు, రామ్ సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసి కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్..

Tollywood: కోస్టారిక దేశ అధికార ప్రతినిధి శ్రీమతి సోఫియా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినీ నిర్మాతలైన ప్రముఖులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ఇక్కడ తెలుగు సినీ రంగానికి సంబంధించి వారితో పలు విషయాలను వారితో చర్చించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 26, 2024, 05:39 AM IST
Tollywood: నిర్మాతలు చదలవాడ శ్రీనివాస రావు, రామ్ సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసి కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్..

Tollywood: కోస్టారిక దేశానికి సంబంధించిన కౌన్సిర్ మరియు జనరల్ కౌన్సిల్ మెంబర్ శ్రీమతి సోఫియా సలాస్ .. తెలుగు సినీ నిర్మాతలైన చదలవాడ శ్రీనివాస రావుతో పాటు ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాముతో పాటు  నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ను మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు  కోస్తారిక దేశంలో షూటింగులకు గల చాన్సెస్ ను  వివరించారు. అంతేకాదు అక్కడ షూటింగ్స్ కు  అనుమతులు అన్ని సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. అంతేకాదు ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలకు  పన్ను రాయితీలు కల్పిస్తామని తెలియ చేసారు.

ఎవరైన కోస్టారిక దేశంలో షూటింగ్ కోసం వెళ్లే నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలియచేశారు. పలువురు నిర్మాతలు పాల్గొని సోఫియాతో  తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి తరపున మరియు ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ  శ్రీమతి సోఫియాని ఘనంగా  సన్మానించారు. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ మనోహర్ రెడ్డి, పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.  ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోఫియా సలాస్ కోస్టా రికన్ లాయర్. ఆమె  యూనివర్శిటీ ఆఫ్ కోస్టా రిక నుండి లా డిగ్రీని మరియు యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ (UK) నుండి మానవ హక్కుల ఇంటర్ డిసిప్లినరీ మాస్టర్స్ డిగ్రీని చదివారు. సహాయం, రక్షణతో సహా అనేక రకాల సమస్యలపై అంతర్జాతీయంగా ఉన్న UN సంస్థలతో హానికర పరిస్థితుల్లో రెఫ్యూజీల కోసం పాటుపడుతున్నారు.  

సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) సాధన దిశగా 10 యేళ్లకు  పైగా కోస్టారికాతో పాటు పలు దేశాల్లో పనిచేశారు. విదేశీ వ్యవహారాల, మంత్రిత్వ శాఖతో కోస్టారికా రాయబార కార్యాలయంలో మంత్రి సలహాదారుగా మరియు కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. అక్టోబర్ 2021లో భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని కోస్టారికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మరియు కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సోఫియా సలాస్ మాట్లాడుతూ : తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాముని తెలుగు ఫిలిం నిర్మాతలు మండలి సెక్రటరీ ప్రసన్నకుమార ని మరియు నిర్మాతలు రామ్ సత్యనారాయణ చదలవాడ శ్రీనివాసరావు లను కలవడం చాలా హ్యాపీగా ఉందన్నారు. అదే విధంగా మోహన్ ముళ్ళపూడి తో కొన్నేళ్లుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకరిస్తున్న మోహన్ ముళ్ళపూడికి ఈ సందర్బంగా  స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఉన్న దేశాలన్నిటిలో మా దేశం కూడా చాలా అందమైనది. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకి పర్మిషన్లు ఇస్తామని చెప్పారు. నిర్మాతలు కోస్టారిక దేశంలో షూటింగ్ చేయాలనుకునేవారు తెలుగు ఫిలిం ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చన్నవారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News