Jr NTR Recent Movies Pre Release Business Details: ‘దేవర’ సహా ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Jr NTR Recent Movies Pre Release Business Details: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో  హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దేవర’. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.

1 /6

తాజాగా ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఈ నేపథ్యంలో తారక్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..

2 /6

దేవర పార్ట్ -1.. తారక్ కథానాయకుడిగా  హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ -1’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.    

3 /6

RRR.. రౌద్రం రణం రుధిరం.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్ కథానాయకులుగా  రాజమౌళి డైరెక్షన్ లో  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ.191 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం వాల్డ్ వైల్డ్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /6

అరవింద సమేత వీరరాఘవ... ఎన్టీఆర్, పూజా హెగ్డే టైటిల్ రోల్స్ లో నటిచిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /6

జై లవకుశ.. ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘జైలవకుశ’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన  ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 86 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /6

జనతా గ్యారేజ్.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.